Kareena Kapoor : సైఫ్ అలీ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ బాలీవుడ్ లో అత్యంత ప్రియమైన జంటలలో ఒకరు. ఈ ఇద్దరూ కెమెరాల ముందు కనిపించిన ప్రతిసారీ ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించడంలో ఎప్పుడూ విఫలమవ్వరు అనే చెప్పాలను. తాజాగా ఈ బ్యూటిఫుల్ లవ్ బర్డ్స్ ఆడిబుల్ యొక్క పోడ్కాస్ట్ సిరీస్ మార్వెల్ వేస్ట్ల్యాండర్స్ క్యాస్ట్ అనౌన్స్మెంట్కు హాజరై తమ లుక్స్ తో అందరి తలల తమవైపు తిప్పుకునేలా చేశారు. ప్రజక్తా కోలి, మసాబా గుప్తా, సికందర్ ఖేర్, మిథిలా పాల్కర్, వ్రజేష్ హిర్జీ ,వంటి ఇతర ప్రముఖులు కూడా రెడ్ కార్పెట్‌ను అలంకరించి అభిమానులను అలరించారు.

ఈ ఈవెంట్ కోసం బేబో పర్పుల్ ప్యాంట్‌సూట్ లో కనిపించి అదరగొట్టింది. మరోవైపు సైఫ్ ఆలివ్ గ్రీన్ జాకెట్ కు డెనిమ్ జీన్స్‌తో జత చేసిన బ్లాక్ టీ-షర్ట్ వేసుకుని మాన్లీగా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ జోడి ఉత్తమ ఫ్యాషన్ లక్ష్యాలను అందించి ఫ్యాషన్ ప్రేమికులను అలరించింది.

బెబో ఈ సిరీస్‌లో బ్లాక్ విడో పాత్రను పోషిస్తుంది. ఈ ఆఫర్ ను చెప్పగానే కరీనా తక్షణమే కనెక్ట్ అయ్యిందని , పాత్రతో ప్రతిధ్వనించిందని క్రూ తెలిపింది. కరీనా ఈ పాత్ర అద్భుతమైనదని పేర్కొంది, ఇందులో భాగమైనందుకు గర్వంగా ఉందని తెలిపింది.

కరీనా కపూర్ ఖాన్ ఫ్యాషన్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. రెడ్ కార్పెట్ లుక్స్ అయినా, క్యాజువల్ గా కనిపించినా, నటి మేజర్ స్టైల్ గోల్స్‌ను అందిస్తుంటుంది. ఈ ఈవెంట్ సందర్భంగా తాను ధరించిన ప్యాంట్ సూట్ తో అద్భుతమైన ఫోటో షూట్ చేసి బాస్ లేడీ ఫ్యాషన్ స్టైల్ స్టేట్మెంట్స్ ను అందించింది. ఈ లుక్ లో బేబోని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఈ ప్యాంట్ సూట్ లో కరీనా బోల్డ్‌గా అందంగా కనిపించిం. లేస్ బ్రాలెట్ వేసుకుని దానిపైన పర్పుల్ బేజర్ ను వేసుకునింది. ఈ బ్లేజర్ కు జోడీగా ప్యాంట్ ను వేసుకుంది. బ్లేజర్ బటన్స్ పెట్టుకోకుండా తన ఇన్నర్ పార్ట్స్ ఎక్స్పోజ్ అయ్యేలా ఈ చిన్నది వంగి మరి తన అందాలను చూపిస్తూ హాట్ ఫోటో షూట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి బోల్డ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా బ్రౌన్ కలర్ మేకప్ వేసుకుని అదరగొట్టింది బేబో. కురులతో పోనీటైల్ వేసుకుని తన ఫేస్ ను ఫోటో షూట్ లో ఎలివేట్ చేసింది. బేబో లుక్స్ చూసిన ఫ్రెండ్స్ ఫైర్ ఏమోజీలను ఆమె ఆన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

కరీనా చివరిసారిగా అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా చిత్రంలో కనిపించింది. ఆమె తర్వాత కృతి సనన్ మరియు టబుతో కలిసి ది క్రూలో కనిపించనుంది. హన్సల్ మెహతా మూవీలోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సైఫ్, ప్రభాస్, కృతి సనన్ , సన్నీ సింగ్‌లతో కలిసిఆదిపురుష్ లో కనిపించనున్నాడు.
