గత ఎపిసోడ్‌లో శోభ బండారాన్నిబయటపెట్టినందుకు సౌర్యకి థ్యాంక్స్ చెబుతాడు నిరుపమ్. అందంతా ఏం వద్దు అని చిరాకు పడుతుంది సౌర్య. తర్వాత మారిపోయిన స్వప్న ప్రేమగా సౌర్య చేతికి గోరింటాకు పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అది నచ్చని సౌర్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. గార్డెన్‌లో కూర్చున్న సౌర్య దగ్గరకి వస్తుంది సౌందర్య. అప్పుడు నేను పారిపోయినప్పుడు నా కోసం ఎవరూ వెతకలేదు కదా అని నిలదీస్తుంది సౌర్య. చిన్నప్పుడు జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటుంది సౌర్య. ఆ తర్వాత ఆగస్టు 12 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
చిన్నప్పుడు సౌర్య ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు వెతుక్కుంటూ వస్తుంది సౌర్య. హిమ ఉన్న ఇంటికి రాను తెగేసి చెప్పడంతో ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత.. ‘ఇప్పుడు చెప్పవే.. నీకోసం నేను రాలేదా? నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వే కదా రాను అంది.. ఇప్పుడు వెతకలేదు అంటావేంటీ?’ అని ప్రశ్నిస్తుంది సౌందర్య. ‘ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను నాన్నమ్మా.. హిమ ఉంటే నేను ఉండను.. ముళ్ల కంప మీద ఉన్నట్లుంది నాకు.. ఈ నటనలు చూడలేకపోతున్నాను.. నేను ఎవరో కొత్త వాళ్ల ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’ అంటుంది సౌర్య. ఇంతలో హిమ, ఆనందరావులు వస్తారు. ‘ఏంటి సౌర్యా అలా మాట్లాడతావ్.. ఇది నీకు కొత్త వాళ్ల ఇంటికి వచ్చిన్నట్లు ఉండడం ఏంటి?. ఈ ఇంట్లో నాకు ఎంత హక్కు ఉంటుందో నీకు అంతే హక్కు ఉంది.. (నిరుపమ్‌తో సౌర్య పెళ్లి చేస్తానని ఇచ్చిన మాటని గుర్తు చేసుకుని) నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను.. బావతో నీ పెళ్లి చేసి తీరతాను’ అంటుంది హిమ. దాంతో ఓ వైపు పెళ్లి పనులు జరగుతుంటే ఇలా మాట్లాడతావేంటీ అని హిమని కోప్పడతారు సౌందర్య, ఆనందరావు. అప్పుడే ఈ నటన చూస్తుంటే మీకే ఇలా ఉంటే నాకే ఉండాలి అని విసుగ్గా అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌర్య.
ఆ తర్వాత స్వప్న పెళ్లి ఏర్పాట్లు చూస్తూ హడావుడి పడుతుంటుంది స్వప్న. ఒకరికి చెప్పాల్సిన పనులను మరొకరికి పూరమాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ ఎక్కడు ఉన్నాడని వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ ఫోన్‌లో హిమ ఫొటోని చూస్తూ బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నిరుపమ్‌కి తెలియకుండా దాస్తాడు. అది చూసిన నిరుపమ్ ఏం సీక్రెట్స్ ఉన్నాయి దాంట్లో అని కసురుతుంటాడు. అప్పడే అక్కడికి వస్తారు సత్యం, స్వప్న. ‘ఇక్కడ మీ మమ్మీ టెన్షన్ పడుతుంది. మీరు కొంచెం హెల్ప్ చేయండి’ అని అంటాడు సత్యం. అనంతరం ప్రేమ్ కొన్ని రోజులుగా అదోలా ఉంటున్నాడని తెలిసి ఏం సంగతి అని అడుగుతాడు సత్యం. ఏం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ప్రేమ్.
ఇక సౌర్య, హిమ, ఆనందరావు, సౌందర్య అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. సౌర్య ఎప్పటిలాగే అందరి మీద కసురు ఉంటుంది. హిమనేమో ఎలాగైనా పెళ్లిని ఆపాలని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో స్వప్న, సత్య షాపింగ్ చేసి హిమకి, సౌర్యకి బట్టలు తీసుకొస్తారు. స్వప్న ప్రేమగా సౌర్యతో.. ‘సౌర్యా హిమతో పాటు నీకు కూడా చాలా చీరలు కొన్నాను’ అంటుంది. ఆ మాటకు తినే కంచంలో చేయి కడిగేసిన సౌర్య.. పైకి లేచి.. ‘నాకు బట్టలు లేవు అని నీకు చెప్పానా అత్తా. ఎవరు తీసుకురమ్మన్నారు’ అంటూ గొడవ చేస్తుంది. ‘కొందరూ ప్రేమ.. కొందరూ జాలి.. కొందరు శాడిజం చూపిస్తున్నారు. ఈ నటనలు చూడలేకపోతున్నా. ఈ పెళ్లి దగ్గరుండి చేస్తానని మాటిచ్చా.. అది అయిపోతే నా దారి నేను చూసుకుంటా’ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సౌర్య ప్రవర్తనకి అందరూ చాలా బాధపడతారు.
ఇక ప్రేమ్‌ని నిరుపమ్‌ని ఎందుకు బాధగా ఉన్నావని అడుగుతుంటాడు. మరోవైపు సౌర్యని హిమ గతంలోలాగా స్నేహితుల్లా ఉండలేమా అని అడుగుతుంటుంది. దానికి ప్రెండ్స్ నీలా మోసం చేయరు అని సౌర్య కడిగేస్తుంది. దాంతో.. ‘ఒకరికి తెలియకుండా ఒకరం నిరుపమ్‌నే ప్రేమించాం. నీకోసం నేను అతన్ని వదులుకుంటా’ అని మనసులో అనుకుంటుంది హిమ. మరోవైపు ప్రేమ్.. ‘ఒరేయ్ నిరుపమ్.. మనిద్దరం ఒకరికి తెలియకుండా మరొకరం హిమనే ప్రేమించాం. హిమ నిన్ను వద్దంటుంది కదా అదేందుకో తెలుసుకోలేవా నువ్వు’ అని మనసులో అనుకుంటాడు. అప్పుడే ‘నాకు సైకాలజీ తెలుసురా.. మనిషికి డబ్బు, ప్రేమ వల్లే సమస్యలు వస్తాయి. నీకు డబ్బు సమస్యలు లేవు. ఇక నీకు ఉన్న ప్రేమ సమస్య అయ్యింటుంది. నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పురా’ అంటూ ప్రేమ్‌ని బ్రతిమిలాడతాడు నిరుపమ్. మరోవైపు నాటకాలు ఆపు అంటూ హిమని తన గదిలో నుంచి గెంటేస్తుంది సౌర్య.
ఆటో మనవరాలు బండి రిపేర్ చేయాలని అనుకుంటాడు ఆనందరావు. అందుకే సౌర్య దగ్గరకి ‘అరే బంగారం నువ్వు వచ్చాక ఈ ఇంట్లో చాలా మంచి పనులు జరుగుతున్నాయి. నీ వల్ల చాలా ఏళ్లుగా మీ నాన్నమ్మతో కోపంగా మాట్లాడే మీ స్వప్నలో మార్పు వచ్చింది. అలాంటి మీ అత్తే మాతో కలిసి పోయినప్పుడు.. నువ్వు హిమకుడా కలవొచ్చుగా’ అన్నట్లు మాట్లాడతాడు ఆనందరావు. దాంతో కయ్యిమని లేచిన సౌర్య దాంతో కలవడం ఈ జన్మకి జరగదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఓ ప్రయత్నం విఫలమైందని ఆనందరావు నిరాశ పడతాడు.
మరోవైపు నిరుపమ్, ప్రేమ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ‘ప్రేమ్‌కి ఏమైందో తెలియట్లేదు.. ఎలాగైనా తెలుసుకోవాలి.. ఈ పెళ్లి కాగానే ఆ పనిలో పడాలి. అసలు హిమ.. సౌర్య ఆలోచన నుంచి బయటికి వస్తే బాగుండు.. నిశ్చితార్థం రోజు నుంచి ఇదే సమస్య. కొంపదీసి ఆ రోజు వెళ్లినట్లు.. పెళ్లిలో పీటల మీద నుంచి వెళితే ఎమైనా ఉందా?. అమ్మో.. అమ్మమ్మకి చెప్పి.. హిమని హౌస్ అరెస్ట్ చేయమని చెప్పాలి’ అని ఓ నిర్ణయానికి వస్తాడు నిరుపమ్.
అక్కడేమో హిమ మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య చీర తీసుకొచ్చి.. వెంటనే కట్టుకో గుడికి వెళ్లాలి అంటుంది. హిమ వద్దులే అన్నా వినకుండా చీర ఆమె చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. హిమ చీర కట్టుకోడానికి వెళుతుండగా ప్రేమ్ అక్కడికి వస్తాడు. ‘సౌర్యకి, నిరుపమ్‌కి పెళ్లి జరగడానికి నువ్వు ఏదో చేస్తానన్నావు కదా బావా. ఎదైనా ఐడియా ఉందా. పెళ్లి సమయం వారాల నుంచి గంటల్లోకి వచ్చింది. ఇప్పుడు ఎలా’ అని ప్రేమతో అంటుంది హిమ. ప్రేమ్, హిమ పెళ్లిని ఆపగలుగుతారా.. ప్రేమ్ మనసులో హిమ ఉన్న విషయాన్ని నిరుపమ్ కనిపెట్టగలుగుతాడో లేదో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.