యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశారు. తెలుగు తో పాటు సౌత్ బాషలలో అలాగే హిందీలో కూడా మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు కూడా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. నిఖిల్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఇది నిలిచింది. అనుపమ పరమేశ్వరన్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలలో కనిపించారు. ఇక శ్రీకృష్ణుడి ద్వారాక నగరం ఎలిమెంట్ ని సినిమాలో టచ్ చేసి కృష్ణ తత్వాన్ని చెప్పే ప్రయత్నం చందూ మొండేటి చేశాడు. ఈ కథాంశం అందరికి ఆకట్టుకుంది.
తెలుగులో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మిగిలిన బాషలలో కూడా పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. హిందీలో కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఉదయం మొదటి ఆటతో పోల్చుకుంటే ఈవెనింగ్ షోలకి ఆడియన్స్ పెరిగారు. అక్కడ ప్రచారం తక్కువ చేసిన మౌత్ టాక్ తో నార్త్ ఇండియా ప్రేక్షకులకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ వారంలో హిందీలో వచ్చిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మూవీ కంటే కార్తికేయ 2 చాలా బెటర్ గా ఉందని, మరో సారి సౌత్ డైరెక్టర్ యూనివర్శల్ ఎలిమెంట్ వచ్చాడని ప్రచారం జరగడంతో ఢిల్లీ, ముంబైలో మల్టీప్లెక్స్ హౌస్ ఫుల్ అయ్యాయి.
180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అమీర్ సినిమా తేలిపోవడం అలాగే అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా ఫ్లాప్ కావడంతో హిందీ ఆడియన్స్ కార్తికేయ 2 చూసేందుకు క్యూ కడుతున్నారు. దీంతో హీరో నిఖిల్ పివిఆర్ సినిమాస్, ఐనాక్స్ మూవీస్ వారికి ట్విట్టర్ లో షోలు పెంచాలని రిక్వెస్ట్ చేశాడు. దీనికి వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. లాల్ సింగ్, రక్షా బంధన్ షోలు తగ్గించి కార్తికేయ 2 షోలు పెంచడానికి అక్కడ డిస్టిబ్యూటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి బిటౌన్ లో నిఖిల్ కార్తికేయ 2 మూవీతో అక్కడి స్టార్ హీరోలైన అమీర్, అక్షయ్ కుమార్ లని బీట్ చేసినట్లు కనిపిస్తున్నాడు అంటూ చర్చించుకుంటున్నారు.