ఏపీలో కూడా రాజకీయాలు చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే అన్ని ప్రాంతీయ పార్టీలని కలుపుకొని దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలని అనుకుంటుంది. అందులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా కలిసి వెళ్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకి హాజరుకావడం విశేషం. అలాగే అరవింద్ కేజ్రీవాల్ , అఖిలేష్ యాదవ్ , పంజాబ్ ముఖ్యమంత్రి కూడా సభకి హాజరయ్యారు. వీరిందరితో కలిసి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా దేశ రాజకీయాలలో శాసించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఇక ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ని నియమించారు. అయితే అధ్యక్షుడి నియామకం తర్వాత మరల ఏపీ వైపు కేసీఆర్ కన్నెత్తి చూడలేదు. విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కూడా అది ఎప్పుడు ఉంటుంది అనేదానిపై క్లారిటీ లేదు. మరో వైపు వచ్చే నెలలో మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకి రంగం సిద్ధం చేసుకున్నారు.
ఏపీలో వైసీపీతో కలిసి వెళ్ళే ప్లాన్ లో ఉన్న కేసీఆర్ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారని టాక్. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ నాయకులు అందరికి గాలం వేస్తున్నారని బోగట్టా. అలాగే జనసేన, టీడీపీ కూటమిని దెబ్బ తీసే విధంగా సరైన సమయంలో ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టి తన వ్యూహాలకి పదును పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు బోగట్టా. అయితే దీనిని బలంగా ఎదుర్కోవడానికి కూడా