సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్‌లు విసురుకోవడం ఈ మధ్య కామన్ గా మారిపోయింది. ఈ ఛాలెంజెస్ పలు రకాలుగా ఉంటున్నాయి. ఇందులో డాన్స్ ఛాలెంజెస్ మాత్రం నెటిజన్లకు యమ కిక్కితేప్పిస్తున్నాయి. బాగా హిట్టయిన పాటలకు పలువురు సెలబ్రిటీలు స్టెప్పేయడం చూసి మురిసిపోతున్నారు నెటిజన్స్. ఇప్పుడు మహేష్ బాబు కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి రీసెంట్‌గా విడుదలైన ‘కళావతి’ సాంగ్ ఛాలెంజ్ హవా నడుస్తోంది. తాజాగా ఈ పాటకు హీరోయిన్ కీర్తి సురేష్ స్టెప్పులేసింది.
కళావతి పాటకు అచ్చు గుద్దినట్లుగా స్టెప్పేసి,ఈ ఛాలెంజ్‌ని మహేష్ బాబు గారలపట్టి సితార మొదలు పెట్టడంతో తెగ డిమాండ్ అయ్యింది. దీనిపై ఇప్పటికే శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ స్టెప్పేయగా.. తాజాగా ఈ పాటలో మహేష్ బాబుతో కలిసి నటించిన కీర్తి సురేష్ స్వయంగా స్టెప్పేసి అందరిని ఫిదా చేసింది. ఈ వీడియోను కీర్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ‘స్టెప్ అదరహో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో భారీ హంగులతో ఈ ‘సర్కారువారి పాట’ సినిమా రూపొందింది. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ బాబు కూడా భాగమయ్యారు. . మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కట్టారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ . మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం మే 12వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్ సినిమా పట్ల ఉన్న క్యూరియాసిటీని మరింత రెట్టింపు చేశాయి.