మొన్నటి వరకు ఒద్దికగా, పద్దతిగా ఉన్న హీరోయిన్స్ అందరూ ఇప్పుడు అందాల ప్రదర్శనకి సిద్ధం అవుతున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో మడికట్టుకొని కూర్చుంటే మన అవకాశాలని వేరొకరు తన్నుకుపోతారని హీరోయిన్స్ కి బాగా అర్ధమయ్యే విషయం. ముఖ్యంగా ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా సత్తా చాటుతున్న టాలీవుడ్ లో సక్సెస్ కావాలంటే కచ్చితంగా గ్లామర్ డోస్ పెంచాల్సిందే అనే కాన్సప్ట్ కి హీరోయిన్స్ వచ్చేసారు. అయితే ఈ ఫార్ములాని మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్రలతో పాటు, రొమాంటిక్ సన్నివేశాలకి కూడా తాను రెడీ అనే సాంకేతాలు రౌడీ బోయ్స్ సినిమాని ఇచ్చేసింది.
ఇక బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ పట్టేస్తుంది. ఇక పద్ధతైన పాత్రలతో నేషనల్ అవార్డు విన్నర్ కూడా అయినా కీర్తి సురేష్ ఇప్పుడు ఫుల్ గా స్లిమ్ అయ్యి గ్లామర్ పాత్రలకి సై అంటుంది. సర్కారు వారి పాట సినిమాలో ఓ పాటలో కాస్తా అందాల ప్రదర్శన చేసింది. ఇక ఇప్పుడైతే హాట్ హాట్ ఫోటో షూట్ లని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తాను గ్లామర్ రోల్స్ కి రెడీ అనే సాంకేతాలు ఇచ్చేస్తుంది. ఇన్ని రోజులు పద్ధతైన పాత్రలే చేస్తానని చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు పాత్రల డిమాండ్ బట్టి గ్లామర్ గా కనిపించడానికి తనకు అభ్యంతరం లేదనే విధంగా చెబుతుంది.
దీనికి కారణం కూడా ఉంది. రష్మిక మందన, సమంత, పూజ హెగ్డే లాంటి బ్యూటీస్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యి బాలీవుడ్ లో కూడా జెండా పాతే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీరిదారిలోనే పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు సంపాదించాలంటే కాస్తా గ్లామర్ పాత్రలకి సిద్ధం కావాల్సిందే అనే విషయాన్ని అర్ధం చేసుకొని హాట్ ఫోటో షూట్ లతో సందడి చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ తన హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసి ఇకపై తగ్గేది లే అనే విధంగా హడావిడి చేస్తుంది. ఈ ఫోటోలు చూసిన తర్వాత కీర్తి సురేష్ కి గ్లామర్ పాత్రలు ఎవరైనా ఆఫర్ చేస్తారేమో వేచి చూడాలి.