Keerthy Sureh: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తరువాత మహానటి సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి కీర్తి సురేష్ చాలా టైమ్ తీసుకుంది. మహానటితో వచ్చిన ఇమేజ్ ఈమెకి కమర్షియల్ సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి కారణం అయ్యింది.
అయితే ఆ సమయంలో తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ తరువాత రంగ్ దే సినిమాతో మరల కమర్షియల్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఆమెకి మరల హిట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు నానికి జోడీగా దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది అనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం ఈ మధ్య కీర్తి సురేష్ రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ప్రేక్షకులకి సరికొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ఫోటోలతో హద్దులు చెరిపేసి అందాల ప్రదర్శన చేస్తుంది. ఇక ఈ ఫోటోల ద్వారా కీర్తి సురేష్ అందాల ప్రదర్శనకి కెట్లు తెరిచింది అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో కలిపి కీర్తి సురేష్ నాలుగు సినిమాలలో నటిస్తుంది. వాటిలో జయం రవి హీరోగా తమిళంలో చేస్తున్న సినిమాలో అల్ట్రా మోడరన్ గర్ల్ గా కీర్తి సురేష్ ఫుల్ గ్లామర్ రోల్ లో కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తనని కమర్షియల్ హీరోయిన్ గా నిలబెడుతుంది అని భావిస్తుంది.