Bollywood: బాలీవుడ్ లో ప్రేమ కథలకు కొదవే ఉండదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. చాలామంది హీరో హీరోయిన్లు సినిమా చేసే సమయంలో ఇష్టపడి తర్వాత ప్రేమించుకుని ఒకటైన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ లో చాలా ప్రేమజంటలు వెండితెరపై జోడిగా నటించి తర్వాత జీవితంలో ఒకటైన వారే. దీపిక పదుకొనే రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ అలియా భట్, ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్, అమితాబచ్చన్ జయ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్ కరీనాకపూర్, ఇలా చాలా మంది తెరపై నటించి తర్వాత జీవితంలో ఒకటైన వారే. కొంతమంది సెలబ్రిటీల ప్రేమ కథలు పెళ్లి వరకు వెళితే, మరి కొంతమంది ప్రేమ కథలు మాత్రం రిలేషన్షిప్ దగ్గర మాత్రమే ఆగిపోతాయి.

ఇదిలా ఉంటే తెలుగు, హిందీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కీయరా అద్వానీ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ విషయాన్ని ఎప్పుడూ కూడా బహిరంగంగా బయటకు చెప్పలేదు. ఇద్దరు కలిసి చాలా ఈవెంట్లలో పాల్గొన్న కూడా తమ ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావించిన కూడా అధికారికంగా ఎక్కడ ధ్రువీకరణ కాలేదు. షేర్షా సినిమాలో మొదటిసారిగా వీళ్లిద్దరు జోడి కట్టారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య బంధం బలపడినట్లు తెలుస్తుంది. అప్పట్నుంచి రిలేషన్ లోనే ఉన్న కీయరా అద్వాని, సిద్ధార్థ మల్హోత్ర తాజాగా పెళ్లితో ఒకటయ్యారు. జైసల్మీర్లో సూర్యఘర్ ప్యానస్ లో వీరిద్దరి పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.
ఈనెల 5, 6వ తేదీన ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కూడా నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు, అది కొద్దిమంది బంధువులు, బాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖుల మధ్యలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. వీరి వివాహానికి బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, సాహిద్ కపూర్ జోహి చావ్లా హాజరైనట్లు సమాచారం. ఇక వీరి వివాహమైన తర్వాత ఫోటోలను అధికారికంగా ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్లో పంచుకున్నారు. మా జీవితంలో ఒకరికొకరు పర్మినెంట్ గా బుకింగ్ అయిపోయాం.
మీ ఆశీర్వాదాలతో ఇద్దరం కలిసి ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం అంటూ కామెంట్స్ పెట్టి తమ ఫోటోలను పంచుకున్నారు. ఇక వీరి వివాహ రిసెప్షన్ ని ముంబైలో త్వరలోనే గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కియరా అద్వాని తెలుగులో రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇది కియారా ఆద్వానికి తెలుగులో మూడు సినిమా అని చెప్పాలి.