Kiara Advani- Sidharth : బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ ,సిద్ధార్థ్ మల్హోత్రా ల వివాహం ఈ మధ్యనే అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైనప్పటి నుంచు ఈ జంట సోషల్ మీడియాలో తమ హ్యాపీ మూమెంట్స్ పిక్స్ ని వదులుతున్నారు. ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నారు. తాజాగా ఈ న్యూ కపుల్ తమ సంగీత్ రాత్రి నుండి కొత్త చిత్రాలను విడుదల చేశారు. ఈ వేడుక కోసం కియారా బంగారు వర్ణం లో ధగ ధగ మెరిసిపోతున్న భారీ అలంకరణలతో వచ్చిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. ఇక సిద్దార్థ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిన డిజైనర్ షేర్వానీ వేసుకుని అదరగొట్టాడు.

కియారా అద్వానీ , సిద్ధార్థ్ మల్హోత్రా జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో జరిగిన ఈ డ్రీమి వెడ్డింగ్ కు అత్యంత సన్నిహితులు ,కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వివాహ సంగీత వేడుక నుండి కియారా సిద్ధార్థ్ విడుదల చేసిన కొత్త చిత్రాలు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి.ఈ వేడుక కోసం అద్భుతమైన కస్టమ్ మనీష్ మల్హోత్రా సంప్రదాయ అవుట్ ఫిట్స్ ను ధరించి జంట అందరి చూపును తమవైపుకు తిప్పుకుంది.

సంగీత్ వేడుకల్లో అందమైన వధువు కియారా డ్యాన్స్ చేస్తుంటే ఆమె నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయాడు సిద్ధార్థ్. ఈ ఫొట ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంట కొన్ని చిత్రాలలో కౌగిలించుకొని తమ ప్రేమను పంచుకున్నారు. ఈ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తో పాటు ‘సమ్ థింగ్ అబౌట్ ఆ నైట్.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ కొత్త జంట ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు.

కియారా వీ నెక్లైన్, ఫుల్-లెన్త్ స్లీవ్‌లు, బ్యాక్ రివీలింగ్ డిజైన్, మెరిసే సీక్విన్ వర్క్, అలంకరించబడిన టసెల్లు , భారీ పూసల ఎంబ్రాయిడరీ తో అద్భుతంగా డిజైన్ చేసిన బ్రాలెట్ వేసుకుంది. దీనికి జోడిగా భారీ అలంకారాలు, స్కాలోప్డ్ హేమ్ వెనుక భాగంలో పొడవాటి ట్రైన్ తో డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. కియారా ఈ లెహంగాకు మ్యాచ్ అయ్యేలా స్టేట్మెంట్ డైమండ్ నెక్లెస్, రూబీ లాకెట్టు, డైమండ్ రింగ్ , హై హీల్స్ వేసుకుని అదరగొట్టింది.
