పాములలో విషసర్పాలు ఉంటాయి. మామూలు పాములు కూడా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పాముల అలజడి కనిపిస్తూ ఉంటుంది. పాము కాటుకు గురై చాలామంది చనిపోతూ కూడా ఉంటారు. ప్రమాదకరమైన పాముల్లో కోబ్రా జాతికి చెందినవి ఎక్కువగా ఉంటాయి. ఇవి కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్ కోబ్రా. కొంత మంది స్నేక్ క్యాచర్స్ పాముల్ని పట్టుకొని వాటిని జనావాసానికి దూరంగా తీసుకెళ్లి విడిచిపెడతారు. ఇలా చేసే సమయంలో ఒక్కోసారి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఎంత పెద్ద పాముని అయినా వారు చాలా చాకచక్యంగా పట్టుకుంటారు.
This dude @therealtarzann be trippin bruh that’s a King Cobra 🐍😭 pic.twitter.com/TkibMw8zFa
— Shannonnn sharpes burner (@shannonsharpeee) August 11, 2022
అయితే కోబ్రాలని పట్టుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి చాలా వేగంగా కదులుతాయి. ఇప్పుడు ఓ కింగ్ కోబ్రాకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రా తోక పట్టుకొని దానిని ఒడుపుగా పట్టి బంధించే ప్రయత్నం చేశాడు. అయితే సుమారు15 అడుగులకి పైగా పొడవున్న ఆ కింగ్ కోబ్రా అంతే బలంగా ఉంది. దానిని పట్టుకున్న కూడా అది వేగంగా అతని వైపు తిరగడంతో భయంతో వదిలేసాడు. అయితే కింగ్ కోబ్రా అతన్ని పాడవకుండా మళ్ళీ అతని నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏకంగా పది లక్షల మందికి పైగా దానిని తిలకించారు. మరణంతో ఆటలంటే ఇలాగే ఉంటాయి అంటూ కొందరు ఆ వీడియో క్రింద కామెంట్స్ చేయడం విశేషం.