AP Politics: ఏపీ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరూ చెప్పలేరు. అలాగే నాయకులు కూడా ఎప్పుడు ఏ గూటిలో ఉంటారో కూడా చెప్పలేరు. నాయకులు ఎప్పటికప్పుడు తమ కండువాలు మార్చేస్తూ ఉంటారు. అవకాశాలు చూసుకొని ఎప్పటికప్పుడు పార్టీలు జంప్ చేయడం కామన్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీతో రాజకీయ కెరియర్ ని స్టార్ట్ చేసిన చాలా మంది నాయకులు ఇప్పుడు వైసీపీలో మంత్రులుగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి సపోర్ట్ తో రాజకీయాలలోకి వచ్చిన వారు ఈ రోజు వైసీపీలో మంత్రుల స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ పై నేరుగా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఫోటోలు దిగితే చాలు అనుకునే వారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఏది ఏమైనా రాజకీయ ముఖచిత్రంగా వ్యక్తిగత అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాల ప్రకారమే అందరూ నడుచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చాలెంజ్ ల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిని ఒకరు చాలెంజ్ లు చేసుకుంటున్నారు. వైసీపీలో ప్రస్తుతం స్ట్రాంగ్ లీడర్స్ గా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా అక్కడ టీడీపీ నుంచి గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు వైసీపీలో బలమైన నాయకులుగా ఉన్నారు. తాజాగా కొడాలి నాని నారా లోకేష్ కి చాలెంజ్ విసిరారు.
దమ్ముంటే తమపైన ఇద్దరు తండ్రికొడుకులు పోటీ చేసి గెలవాలని అన్నారు. ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోట. అయితే ఇప్పుడు వైసీపీకి బలమైన నియోజకవర్గాలు. ఈ నేపధ్యంలోనే టీడీపీకి అక్కడ పోటీ చేసే దమ్ము లేదని కొడాలి మాటల బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీపై విమర్శలు చేయడంలో వైసీపీ పార్టీ నుంచి ముందు వరుసలో ఈ ఇద్దరు నాయకులు ఉండటం విశేషం. వీరి మాటలని బలంగా ఎదుర్కోగలిగే నాయకులే టీడీపీలో లేకుండా పోయారు.