వైసీపీలో ఎమ్మెల్యేల అసంతృప్తి స్వరం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా అధిష్టానంపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీతో సంబంధం లేకుండా కొంత మంది సొంత అజెండాతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అధిష్టానంపై బహిరంగ సభల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అతనిపై జగన్ రెడ్డి వేటు వేసి ఇన్ చార్జ్ బాద్యతల నుంచి తప్పించింది. అలాగే ప్రభుత్వ సంబందిత కార్యక్రమాలకి కూడా దూరం చేసింది. ఈ నేపధ్యంలో ఆనం టీడీపీలో వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం వైసీపీలోనే ఉన్నా కూడా సొంతగా ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు నెల్లూరులోనే మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సొంత అజెండాతో ప్రజలలోకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నా అని, ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చలేకపోతున్న అని చాలా కాలంగా తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. అయితే కోటంరెడ్డిని వైఎస్ జగన్ ఇప్పటికే రెండు, మూడు సార్లు పిలిచి వారించిన కూడా తన సహజశైలిలోనే అతను వెళ్తున్నారు. నమ్ముకున్న ప్రజలకి ఇచ్చిన హామీని నెరవేర్ శక్తి లేని ఎమ్మెల్యే పదవి ఎందుకు అనే విధంగా ఆయన మాటలు ఉన్నాయి.
అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిస్తాత్మకంగా ప్రచారం చేసుకుంటున్న ఆరోగ్య శ్రీ పథకంపై కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శ్రీ వలన కొంతమందికే లబ్ది చేకూరుతుంది అని చెబుతూ దానికి ప్రత్యామ్నాయంగా తన నియోజకవర్గం నెల్లూరులో ఆరోగ్య రక్ష అనే పథకం అమలు చేయబోతున్నట్లు తెలిపారు. పేదలకి కార్పోరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం స్టార్ట్ చేసినట్లు తెలిపారు. నెల్లూరులోని 6 ఆసుపత్రులకు చెందిన 33 మంది వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు ఈ పథకంలో భాగస్వాములు అయ్యాయని చెప్పారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా సొంత ఖర్చుతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు నెల్లూరులో కోటంరెడ్డి ఆరోగ్య రక్ష స్కీమ్ హాట్ టాపిక్ గా మారింది.