ఏపీలో అధికార పార్టీ వైసీపీలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి రూపంలో గట్టి దెబ్బ తగిలిన జగన్ కి ఇప్పుడు నెల్లూరు నుంచి మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూపంలో మరో షాక్ తగిలింది. నియంతృత్వ విధానాలతో ప్రశ్నించే వారు సొంత పార్టీ నాయకులు అయినా కూడా నిఘా పెట్టి వారిని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీ అధిష్టానంకి షాక్ ల మీద షాక్ లు తాగుతున్నాయి అని చెప్పాలి. కోటంరెడ్డి తాజాగా తన ఫోన్ ట్యాపింగ్ చేసారంటూ ఆరోపణలు చేశారు. అవి వైరల్ గా మారాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదని అవన్నీ కావాలని కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
దీంతో మళ్ళీ మీడియా ముందుకి వచ్చిన కోటంరెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఆడియో రికార్డులతో షా చూపించారు. అలాగే తనకి ఫోన్ చేసింది ఇంటలిజెన్స్ చీఫ్ అని మీడియా ముఖంగా చెప్పేశారు. అయితే దీనిపై ఎప్పటిలాగే అధికార పార్టీ ఎదురుదాడి చేస్తూ ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాని ప్రెస్ మీట్ పెట్టి మరీ వాటిని కోటంరెడ్డి బయటపెట్టడంతో అతనిపై తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి పార్టీకి విధేయుడుగా ఉండే కోటంరెడ్డి మీడియాలో మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీలో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు, 5 గురు మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తనకి కాల్ చేసి చెప్పారని తెలిపారు. ఆత్మాభిమానం చంపుకొని అనుమానించే చోట తాను ఉండలేనని తెగేసి చెప్పేసాడు. అలాగే చంద్రబాబు నాయుడు అవకాశం వస్తే టీడీపీ నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో కోటంరెడ్డి టీడీపీలోకి చేరడం ఖాయం కాగా మరో వైపు ఎమ్మెల్యే చేసిన విమర్శలపై ప్రజలకి ఎలా సమాధానం చెప్పుకోవాల అనే సమాలోచనలో జగన్ రెడ్డి పడినట్లు తెలుస్తుంది.