krithi Setty : కృతిశెట్టి వరుసగా మూడు సినిమాలతో మంచి సక్సెస్‌ను అందుకుని భారీగానే క్రేజ్‌ను మూటగట్టుకుంది. ముఖ్యంగా ఉప్పెన సినిమాలో బేబమ్మగా ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా వస్తోన్న వారియర్ చిత్రంలో నటించింది. ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తోంది. ఇక హీరో, హీరోయిన్ల క్రష్‌ల గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు? వారు కనిపిస్తే చాలు.. అభిమానుల నుంచి ఫస్ట్ తలెత్తే ప్రశ్న మీకు ఎవరంటే క్రష్? అని. సోషల్ మీడియాలో సైతం తమ అభిమాన నటులను ఫ్యాన్స్ ఇవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అమ్మడి సమాధానం విని అంతా అవాక్కయ్యారు.
Krithi Setty : తమిళ్ నేర్చుకోవడానికి ఆయన సినిమాలే చూస్తుంటా..
ఏమాత్రం దాపరికం లేకుండా తన క్రష్ ఎవరో చెప్పేసిందీ ముద్దుగుమ్మ. ‘ది వారియర్’ ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ భామ తాజాగా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. తన క్రష్ ఎవరో చెప్పి అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ‘ది వారియర్’ ప్రమోషన్లలో భాగంగా సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్నకు కృతి స్పందించింది. తనకు తమిళ్ హీరో శివ కార్తికేయన్ అంటే చాలా ఇష్టమని వెల్లడించింది. శివ కార్తికేయన్ యాక్టింగ్‌ను తాను చాలా ఇష్టపడతానని తెలిపింది. అంతేకాకుండా తమిళం నేర్చుకోవడం కోసం శివ కార్తికేయన్ సినిమాలను చూస్తుంటానని వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగు, తమిళ భాషల్లో ది వారియర్ సినిమా ఏకకాలంలో రూపొందింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక కృతిశెట్టి ఆఫర్ల మీద ఆఫర్లతో దూసుకుపోతోంది. అమ్మడు తెలుగుతో పాటు తమిళంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకోవడంతో తిరుగు లేకుండా పోయింది. ప్రస్తుతం తెలుగులో నితిన్, నాగచైతన్య సరసన నటిస్తోంది. ఇక తమిళంలో స్టార్ హీరో సూర్య సరసన అవకాశం చేజిక్కుంచుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘అచలుడు’లో హీరోయిన్గా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.