అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఆకట్టుకుంది. తరువాత ప్రేమమ్ రీమేక్ తో మరో హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత శతమానం భవతి సినిమాతో మరో సక్సెస్ ని కూడా సొంతం చేసుకుంది. దీంతో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే ఆ తరువాత సినిమాలు అనుపమకి అంత సక్సెస్ ఇవ్వలేదు. రీసెంట్ గా రౌడీ బాయ్స్ సినిమాలో అనుమప ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో తాను పెట్టుకున్న రూల్స్ పక్కన పెట్టేసి హాట్ సన్నివేశాలు కూడా కొత్త హీరోతో చేసింది. అయినా ఆ సినిమా సక్సెస్ అందుకోలేదు ఇక తాజాగా కార్తికేయ2 తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
దీని మీద చాలా నమ్మకాలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ రాకుంటే ఇక అనుపమ కెరియర్ ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. అయితే కార్తికేయ 2కి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఆమె పాత్రకి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో సరైన సమయంలో మరల అనుపమ పరమేశ్వరన్ కి హిట్ బొమ్మ పడిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మరో అందాల భామ కృతి శెట్టి మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో వెంటవెంటనే అవకాశాలు అందుకుంది.
నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో మరో హిట్ కొట్టింది. ఆ తరువాత అమ్మడునుంచి వచ్చిన ది వారియర్ మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. హీరోయిన్ పాత్రకి కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక తాజాగా నితిన్ కి జోడీగా మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ లక్కీ హీరోయిన్ ఫేట్ అన్ లక్కీ లోకి వచ్చేసింది. ఇక నెక్స్ట్ సుధీర్ బాబుతో చేయబోతున్న ఆ అమ్మాయి తప్ప అనే సినిమా మీదనే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది.