Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అదిరిపోయే లుక్స్ తో నెట్టింట్లో మంటలు రేపుతోంది. రోజు జోజుకు తన లుక్స్ ను అప్డేట్ చేస్తూ కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆమెలో ఎంతో చేంజ్ స్పష్టంగా కనిపిస్తోంది.

సాంప్రదాయ లుక్స్ నుంచి , హై-షైన్ పార్టీ అవుట్ ఫిట్స్ వరకు, కృతి సనన్ స్టైల్ డైరీలు అన్నీ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందించేవే తాజాగా ఈ చిన్నది పూల గౌన్ వేసుకుని నెట్టింట్లో మ్యాజిక్ చేస్తోంది.

ప్రస్తుతం కృతి త్వరలో విడుదల కాబోతున్న షెహజాదా ప్రమోషన్లతో బిజీగా ఉంది. కృతి పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తూ ఆమె ఫ్యాషన్ లుక్స్ తో సినిమా ప్రమోషన్ చేస్తోంది. నటి తన అభిమానులకు కొన్ని అద్భుతమైన ఫ్యాషన్ క్షణాలను అందిస్తోంది. రంగురంగుల అందమైన పూల ప్రింటెడ్ అలంకరణలతో వచ్చిన వైట్ కలర్ గౌన్ వేసుకుని తాజా ఫోటో షూట్ తూ అభిమానుల మనసు దోచేస్తోంది.

డీప్ వీ నెక్లైన్ , ఫ్లెయిర్డ్ మిడి స్టైల్‌తో వచ్చిన ఈ డ్రెస్ లో కృతి ఎంతో అందంగా కనిపిస్తోంది. బ్యాక్ సైడ్ వచ్చిన నాట్ డీటెయిల్స్ నడుము దగ్గర వచ్చిన కట్ ఔట్స్ కృతి అందాలను ఎలివేట్ చేస్తున్నాయి.

ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా చెవులకు చిన్న స్టడ్స్ పెట్టుకుంది. పాదాలకు వైట్ హీల్స్ వేసుకుని అదరగొట్టింది. తన కురులను లూస్ గా వదులుకుని , కనులకు ఐ లైనర్, మస్కార, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని సింపుల్ మేకప్ లో స్టన్నింగ్ గా కనిపిస్తూ అందరిని మంత్రముగ్ధులను చేస్తోంది.