Kriti Sanon : త్వరలో విడుదల కాబోతున్న బాలువడ్ చిత్రం షెహజాదా ప్రమోషన్‌లో బిజీ బిజీగా గడుపుతోంది కృతి సనన్. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటిస్తుండగా , కృతి అతనితో హీరోయిన్‌గా జోడీ కట్టింది. 2020లో తెలుగులో విడుదలైన అల్లు అర్జున్ పూజా హెగ్డేల చిత్రం అలా వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కృతి అధిరిపోయే దుస్తులను ధరించి తన హాట్ లుక్స్‌తో ఫ్యాషన్ ట్రెండ్స్ తో సినిమాను ప్రమోట్ చేస్తోంది.

ఈ లైమ్ గ్రీన్ కో ఆర్డ్ సెట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది కృతి సనన్. థిన్ స్ట్రిప్స్ డీప్ నెక్‌లైన్ క్రాప్ టాప్ ను ధరించి దానికి జోడీగా తొడ వరకు స్లిట్‌తో వచ్చిన హై పెన్సిల్ స్కర్ట్ ను ధరించింది. అలా సోఫాలో తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది ఈ ముంబై బ్యూటీ. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే కృతి ఈ పిక్స్ ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె రూపాన్ని ఉర్ఫీ జావేద్‌తో పోలుస్తూ స్పందిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరుతో ఉర్ఫీ జావెద్ చేసే ప్రయోగాల గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె అసాధారణమైన , సార్టోరియల్ వార్డ్‌రోబ్ ముంబైలో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనూ ఉంటాయి. నెటిజన్లు ఆమె రోజువారీ రూపాన్ని ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయినా ఈ భాయ ఫ్యాషన్‌తో నెట్టింట్లో దాడి చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కృతి ధరించిన లుక్ చూసి ఫ్యాన్స్ అభిమానులు కృతి తాజా రూపాన్ని జావేద్ ఫ్యాషన్ సెన్స్ తో పోలుస్తున్నారు. దీనిని బట్టి కృతి ఎంత హాట్‌గా కనిపించిందో అర్థం చేసుకోవచ్చు.

కృతి తన లుక్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే విధంగా పాదాలకు హీల్స్‌ను ధరించింది. చెవులకు బంగారు హూప్ ఇయర్ పెట్టుకుంది. చేతి వేళ్లకు బంగారు ఉంగరాలు ధరించింది. ఇక చేతికి భారీ బంగారు గాజు వేసుకుని అందరి చూపును ఆకట్టుకుంది. ఫ్యాషన్‌తో తన సినిమాను ప్రమోట్ చేయడం కృతికి కొత్తేమి కాదు. గతంలోనూ అనేక బాలీవుడ్ చిత్రాలను ఫ్యాషన్ తోనే ప్రమోట్ చేసింది.

ఓ వైపు ప్రమోషన్ ఈవెంట్‌లకు హాజరవుతూనే మరోవైపు హాట్ ఫోటో షూట్‌లు చేసిన సోషల్ మీడియాను షేక్ చేసేసింది. తాజాగా షెహజాదా కోసం కూడా ఈ బ్యూటీ రెచ్చిపోతోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి అవుట్‌ఫిట్స్‌తో అలరిస్తుందోనని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.