Lokesh Kanagaraj: కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా తనదైన సినిమాలతో దూసుకుపోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటికే ఖైది, మాస్టర్, విక్రమ్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఇళయదళపతి విజయ్ హీరోగా లియో అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుంది. ఇక ఇప్పటి వరకు తాను చేసిన సినిమా స్టోరీస్ లోని క్యారెక్టర్స్ ని కలిపి ఒక సినిమా చేయాలని లోకేష్ కనగరాజ్ ప్లాన్ లో ఉన్నాడు.

అయితే ఆ సినిమా కచ్చితంగా ఇండియా మొత్తం చర్చించుకునేలా ఉండాలంటే ఆ సిరీస్ లో వచ్చే అన్ని సినిమాలు ఒకదానిని మించి ఉండాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ గురించి ఇప్పుడు కోలీవుడ్ లో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లోకేష్ కనగరాజ్ లియో సినిమా తర్వాత ఖైది సీక్వెల్ చేయాలని అనుకున్నాడు. అయితే ఇప్పుడు దానికంటే ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.
ఇక చాలా రోజుల నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ తో లోకేష్ సినిమా చేస్తే చూడాలని కోలీవుడ్ లో ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో యువ దర్శకులతో ఎక్కువ సినిమాలు చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ ని పిలిచి మంచి కథ సిద్ధం చేయాలని సినిమా చేద్దామని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో లోకేష్ కూడా ఊహించని ఈ ఆఫర్ కి ఒకే చెప్పినట్లు టాక్. ఈ నేపధ్యంలో లియో సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తోనే మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.