Macharla Niyojakavargam : నితిన్, ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మాచర్ల నియోజకవర్గం. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నితిన్ మనం ఎప్పుడూ లవర్ బాయ్‌గానే చూస్తున్నాం. ఈ సారి మాత్రం యాక్షన్ రోల్లో నటించాడు. మరి ఈ రోల్‌ను ప్రేక్షకులు ఎలా తీసుకుంటున్నారు? ఈ సినిమా హిట్ అంటున్నారా? ఫట్ అంటున్నారా? ట్విటర్ వేదికగా ప్రేక్షకులు సినిమాపై ఏం రివ్యూ ఇస్తున్నారో చూద్దాం.
సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు.. మొదటి భాగం బాగోలేదంటుంటే.. కొందరు సెకండ్ పార్ట్ యావరేజ్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో గొప్పగా ఏమైనా చెప్పుకోవాలంటే.. అది వెన్నెల కిషోర్ కామెడీ మాత్రమేనంటున్నారు. దాదాపు అంతా ఫస్ట్ హాఫ్‌కు ఇదే రివ్యూ ఇస్తున్నారు. సెకండ్ హాఫ్ బాగుంటే తప్ప సినిమా నిలబడే అవకాశమే లేదని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీని తీసి పక్కనబెడితే మిగతా సినిమా అంతా డల్ అని చెబుతున్నారు. పాటలు సో సోగా ఉన్నాయంటున్నారు. ఇక కథ సెకండ్ హాఫ్ నుంచే ప్రారంభమయ్యిందన్నారు. ఇక నితిన్ అభిమానులు మాత్రం దీనికి భిన్నమైన రివ్యూ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అదరగొట్టిందంటున్నారు. మరికొందరేమో.. మనీ వేస్ట్, టైమ్ వేస్ట్ అంటూ ట్వీట్ చేస్తున్నారు.
Macharla Niyojakavargam : క్రెడిట్ అంతా వెన్నెల కిషోర్‌కే..
ఇక సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందంటున్నారు కొందరు ట్విటర్ జనాలు. ఇదే నితిన్‌ను సేవ్ చేసిందని.. సినిమా హిట్టేనని చెబుతున్నారు. చాలా వరకూ సెకండ్ హాఫ్ సినిమాకు చాలా ప్లస్ అవుతుందంటున్నారు. అయితే మరికొంత మంది మాత్రం సెకండ్ హాఫ్ మూవీ కూడా ఏమంత బాగోలేదంటున్నారు. ఈసినిమాపై టోటల్‌గా మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు హిట్ అంటుంటే.. కొందరు ఫట్ అంటున్నారు. మరికొందరు యావరేజ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక నితిన్ ఫ్యాన్స్ అయితే సాలిడ్ హిట్ కొట్టామని ఢంకా బజాయిస్తున్నారు. సినిమా మొత్తంలో నితిన్, కృతి శెట్టి నటన గురించి పెద్దగా ఎవరూ మాట్లాడలేదు కానీ వెన్నెల కిషోర్‌కు మాత్రం ఫుల్ క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. ఇక ఓవరాల్ రివ్యూ ఎలా ఉంటుందో చూడాలి.