Maharashtra : విద్య యొక్క ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కొత్త విషయం కాదు. అయితే ఈ విషయాన్ని రుజువు చేసే విషయంలో, మహారాష్ట్రలోని ఒక టీచర్ పాఠశాలలో విద్యను బోధించడానికి ప్రతిరోజూ 10 కిలో టీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి స్కూల్‌కు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే అతని విద్యార్థి ఒక్కడే. అవును ఆ స్కూల్‌లో ఉన్న ఒకే ఒక్క విద్యార్ధి కోసం ఈ మాస్టారు పడుతున్న తపన అలాంటిది. జిల్లా పరిషత్ పాఠశాలలో గత రెండేళ్లుగా ఒకే విద్యార్థి ఉన్నాడని ఒక్కడే ఉన్నా అతనికి పాఠాలు చెబుతున్నానని ఉపాధ్యాయుడు కిషోర్ మాన్కర్ మీడియాకు తెలిపారు.

చాలా మంది పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చడానికి చాలా రకాలుగా ఆలోచిస్తారు. పెద్ద స్కూల్‌లో వేయాలని, అన్ని సదుపాయాలు కల్పించాలని తాపత్రయ పడుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాస్టార్లు సరిగా చదువు చెప్పరని, పిల్లలు క్రమశిక్షణతో ఉండరని భావిస్తున్నాడు. ఇక చాలా స్కూళ్లల్లో మాస్టార్లు కూడా తమకు ఇచ్చిన జీతానికి న్యాయం చేసే పనిలో ఉంటారు. కానీ ఈ మాస్టారు అందుకు విరుద్దంగా నిలుస్తారు. ప్రభుత్వం ఇస్తున్న జీతానికి న్యాయం చేస్తూ , ఒక్క విద్యార్ధి ఉన్నా విద్యను ఎలాగైనా అందించాలన్న ఉద్దేశమే ఈ పిల్లాడికి మంచి చదువు అందుతోంది.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని గణేష్‌పూర్ గ్రామంలో ఉన్న మాన్కర్ ఈ ప్రాంతం. ఈ ప్రాంతం జనాభా కేవలం 150 మాత్రమే. వీరికోసమూ స్థానికంగా జిల్లా పరిషత్ పాఠశాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ పాఠశాల ఒకటి నుంచి నాలుగు తరగతులను మాత్రమే నిర్వహించేందుకు అనుమతించింది సర్కార్.

అందుకే ఈ గ్రేడ్‌లకు సరిపోయే వయస్సులో ఉన్న ఏకైక విద్యార్థి ఈ బాలుడు మాత్రమే అని టీచర్ కిషోర్ మాన్కర్ తెలిపారు. అందుకే గత 2 సంవత్సరాలుగా పాఠశాలలో ఒక విద్యార్థి మాత్రమే చేరాడన్నారు. నేను స్కూల్‌లో టీచర్‌గా నా బాధ్యతను నిర్వహించాలన్న ఉద్దేశంతో ఒకే విద్యార్ధి ఉన్నా పాఠాలు బోధిస్తున్నాని మాన్‌కర్ తెలిపారు. ఈ పిట్టాడికి అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు మాన్కర్. అంతేకాదు మధ్యాహ్న భోజనం సహా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలపారు.