Maharastra : భూకంప దాటికి టర్కీ , సిరియా దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రమాదంగా ఈ భూకంపాన్ని అభివర్ణించారు అనలిస్టులు. దాదాపు 41వేలకు పైగా అక్కడి నివాసితులు మరణించినట్లు సమాచారం. వేల మంది క్షతగాత్రులుగా మిగిలారు.భారీ భవనాలు క్షణాల్లో కుప్పకూలి అక్కడి వేల మంది ప్రజలను నివాసితులను చేశాయి. శిథిలాల కింద చిక్కుకున్న వందల మంది ప్రాణాలను కాపాడుతున్న విజువల్స్ ఇంకా కనులముందే కదలాడుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రజలను ఓ వింతైన శబ్దం భయబ్రాంతులకు గురి చేస్తోంది.
మహారాష్ట్రలో వింతైన శబ్దాలు వస్తుండటంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు.

మహారాష్ట్రలోని లాతూర్ నగరంలోని తూర్పు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా అంతుతెలియని మిస్టీరిస్ శబ్దాలు భూగర్భం నుంచి వినబడుతున్నాయి. బుధవారం ఉదయం 10.30 నుంచి 10.45 గంటల మధ్య వివేకానంద్ చౌక్ సమీపంలో మరోసారి ఈ శబ్దాలు వినిపించడంతో పెద్దఎత్తున
భూకంపం వస్తుందనే పుకార్లు వచ్చాయి. అయితే, అక్కడ ఎటువంటి భూకంప సంకేతాలు కనిపించలేదు. అయినా ఈ మిస్టీరిస్ శబ్దాలు ఏమిటో అర్థం కాక ఈ ప్రాంత నివాసితుల్లో భయాంతదోళన నెలకొంది. ప్రాణాలను గుప్పెట్లోపెట్టుకుని ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.

జిల్లా విపత్తు నిర్వహణ విభాగం లాతూర్ నగరంలోని భూకంప కొలత కేంద్రాలతో పాటు జిల్లాలోని ఔరద్ షాహజ్ని , ఆశివ్‌ల నుండి సమాచారం తీసుకున్న తర్వాత కొంతమంది స్థానిక పరిపాలన అధికారులను అప్రమత్తం చేసింది. అయితే ఈయా ప్రాంతాల్లో ఏ విధమైన భూకంప కార్యకలాపాల గురించి నివేదిక లేదని అధికారులుపేర్కొంటున్నారు.
1993లో జిల్లాలోని కిల్లారి గ్రామం, పరిసర ప్రాంతాలలో ఘోరమైన భూకంపం సంభవించింది. సుమారు 10,000 మంది ప్రాణాలను బలిగొంది.విపత్తు నిర్వహణ అధికారి సాకేబ్ ఉస్మానీ మాట్లాడుతూ, మరఠ్వాడా ప్రాంతంలో ఎప్పటికప్పుడు కొన్ని శబ్దాలు నివేదించబడ్డాయిని తెలిపారు. సెప్టెంబరు 2022లో, లాతూర్ జిల్లాలోని హసోరి, కిల్లారి , పరిసర ప్రాంతాల్లో మూడుసార్లు అలాంటి శబ్దాలు వినిపించాయన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన జిల్లాలోని నీలంగా తహసీల్‌లోని నీటూరు-దంగేవాడి ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు వినిపించాయని అధికారి తెలిపారు. ఈ శబ్దాలపై మరింత అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.