Happy Birthday Mahesh : గ్లామర్ ఫీల్డ్కి కావల్సిన దానికంటే అంతకు మించి గ్లామర్.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ప్రిన్స్.. నటనలో సూపర్ స్టార్ వెరసి.. అన్నీ కలిసి మిక్సీలో వేసి తీస్తే.. అది మహేష్‌బాబు. అందరికీ ఏజ్ పెరుగుతుంటే మనోడికి మాత్రం తరుగుతూ ఉంటుంది. అర్ధ సెంచరీకి చేరువవుతున్నా కూడా కాలేజ్ స్టూడెంట్‌కి ఏమాత్రం తీసిపోడు. సూపర్ స్టార్ వయసు, అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కవే. మహేష్.. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్స్ ఉంటుంది. ఆ స్మైల్, లుక్‌కి అమ్మాయిలు ఫ్రీజ్ అయిపోతారు. ఈ ఘట్టమనేని వంశోద్ధారకుడికి 47వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం.
నటశేఖరుడు కృష్ణ వారసుడిగా.. ‘రాజకుమారుడు’గా మహేష్ ఇంటస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత ‘మురారి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ‘పోకిరి’తో అయితే బాక్సాఫీసుల దుమ్ము దులిపేశాడు. ఆ తరువాత ‘ఒక్కడు’కి ఎదురేలేకుండా తన ‘దూకుడు’గా దూసుకుపోయాడు. తన ‘ఖలేజా’ చూపిస్తూ బాక్సాఫీస్‌ని షేక్ చేసే ‘సైనికుడి’గా మారి టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై సూపర్ స్టార్ అయ్యారు. ఇక ఆ తరువాత వచ్చిన ‘అతిథి, బిజినెస్‌మేన్, స్పైడర్, మల్టీ స్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట’ సినిమాలతో నిజంగానే ఇండస్ట్రీలో తనకు సరిలేరనిపించుకున్నాడు.
Happy Birthday Mahesh : యాడ్స్ ప్రపంచాన్ని ఏలేస్తున్న హీరోల్లో టాప్ ప్లేస్
మహేష్ కెరీర్లో ఫ్లాప్‌లు చాలా తక్కువే. అయినా కూడా ఆయనకు హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేదు. అవకాశాలకు కొదువ ఉండదు. మహేష్కున్న క్రేజ్ చూసి తమ ప్రొడక్ట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ ఎన్నో కంపెనీలు ఆయన ముందు వాలిపోతున్నాయి. అసలు ఇండస్ట్రీలోనే యాడ్స్ ప్రపంచాన్ని ఏలేస్తున్న హీరోల్లో టాప్ ప్లేస్‌లో మహేష్ ఉండటం విశేషం. బాల నటుడిగా బొద్దుగా ముద్దుగా వచ్చిన మహేష్.. గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. నటశేఖర కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న మహేష్ జన్మించాడు. నాన్న సూపర్ స్టార్ కావడంతో వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్ తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకున్నాడు. 7 రాష్ట్ర నంది అవార్డులు, ఫిలింఫేర్, సైమా అవార్డులు ఆయన ప్రతిభకు తార్కారణంగా నిలిచాయి. ఏది ఏమైనా.. ఆయన గ్లామర్ ప్రపంచాన్ని నిర్విరామంగా మరికొన్నేళ్ల పాటు ఏలాలని కొరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్.