Mahesh Murari : మహేష్ ఈ పేరు వింటే అందరికీ వైబ్రేషన్స్ వస్తాయి. నిజమే కటౌట్ అలాంటిది మరి. బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కృష్ణ గారి కొడుకు ఇప్పుడు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగి ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నాడు. మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతి మూవీలో తనదైన వైవిధ్యమైన నటనతో స్టార్డమ్ సంపాదించుకున్న నటుడు మహేష్. ప్రారంభంలో మహేష్ నటించిన మురారి సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో అమ్మవారి శాపానికి గురైన ఉన్నత కుటుంబానికి చెందిన కథ నేపథ్యంలో మురారి.సోనాలి క్యూట్ లుక్స్, మహేష్ మెస్మరైజింగ్ యాక్టింగ్, సీనియర్ నటుల పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ కనుల ముందే కదలాడుతుంది. కరెక్ట్ గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున మురారి సినిమా విడుదల అయ్యింది. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించింది. ఈ నేపథ్యంలో అసలు మురారి సినిమా కథకి లీడ్ ఎక్కడ నుంచి ప్రారంభమైంది కృష్ణవంశీకి ఈ ఐడియా ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు అసలైన టాపిక్. మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కృష్ణవంశీ పంచుకున్నారు.

సాధారణంగా ప్రతి సినిమాలో హీరో, విలన్ ఉంటారు. వీళ్ళిద్దరి వీదే ఆధారపడి కథ నడుస్తుంది. అయితే మురారి సినిమాను కాస్త వైవిధ్యంగా తీయాలి అని అనుకున్నారు కృష్ణవంశీ. విలన్ గా ఒక వ్యక్తి ఉండకుండా ఆ స్థానంలో ఓ పవర్ ఉండాలని అనుకున్నారట. ఆ ఐడియా నుంచి అమ్మవారి శాపానికి గురైన హీరో ఆ శాపం నుంచి విముక్తి పొందేందుకు ఏం చేస్తాడు అన్న కథ ఆధారంగా మురారి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు తమ నటనతో అందరిని అలరించారు. సీనియర్ నటులు అందరూ కూడా ఈ మూవీలో కనిపిస్తారు. కృష్ణ వంశీ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చుతుంది. మురారి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది.

అయితే ఈ సినిమాకి మురారి అన్న పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ సినిమాకు ఆ పేరు వచ్చింది మహేష్ వల్లేనట. ఈ సినిమాలో మహేష్ ను చూస్తే బృందావనంలో ఉన్న కృష్ణుడిలా ఉండేవాడట. అందుకే సినిమాకి మురారి అని పేరు పెట్టారు. ఏది ఏమైనా అప్పట్లో యూత్ ని ఓ రేంజ్ లో అలరించింది మురారి సినిమా. బావ మరదళ్ళ సరదాలు, దేవుడి శాపం, తెలుగింటి సంప్రదాయాలు సంస్కృతులు అన్నింటిని మేలవించి సినిమా తీసి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు కృష్ణ వంశీ.
