Mahesh సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలి కాలంలో మంచి సక్సెస్ బాటలో పయనిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సర్కారు వారి పాటతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేయనుండటం విశేషం. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వంటి సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మూవీ రాబోతుందని అనౌన్స్ చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
Mahesh మహేష్ మోకాలికి సర్జరీ..
నిజానికి మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఎప్పుడో తెరకెక్కాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లేవడంతో ఈ సినిమా షూటింగ్ బాగా వెనక్కి జరిగింది. ఇక మహేష్ బాబు మోకాలికి సర్జరీ జరగడం.. ఆ తరువాత ఆయనకు కరోనా సోకడం వంటి కారణాలతో ఈ సినిమా పట్టాలెక్కడానికి మరింత సమయం తీసుకుంది. ఇక మీదట అయినా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభం అవడం ఖాయం. ఈ లోపే ఈ సినిమా స్టోరీ లైన్ బయటకు వచ్చేసిందని బీభత్సంగా టాక్ నడుస్తోంది.
మహేష్ బాబు మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఖలేజా సినిమా టైపులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అందిస్తారట. ఈ మూవీ ఇండియాలో రాజకీయం ఓ వ్యాపారంగా ఎలా మారంది? దీని వల్ల సమాజం ఏం కోల్పోతుంది? అనే విషయాలను సందేశాత్మకంగా చూపించబోతున్నారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాను ప్రజెంట్ చేసే విధానం ఇండియాలో ఏ సినిమాలో చూపించని విధంగా ఉంటుందని తెలుస్తోంది. అసలే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా.. ఆపై పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఓ సందేశం అనగానే ఈ సినిమా కూడా తమ అభిమాన హీరోకి మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించడం ఖాయమని అభిమానులు ఇప్పటికే మురిసిపోతున్నాయి.