Malaika Arora : ఇండస్ట్రీలో అత్యంత గ్లామర్‌గా ఉన్న నటీమణుల్లో ఆమె ఒకరు మాలిక అరోరా .బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తన ఫ్యాషన్ స్టైల్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగలదు. ఆమె బోల్డ్ దుస్తులకు, ఫిట్‌నెస్‌కు కూడా ప్రసిద్ది చెందింది. మలైకాకు సోషల్ మీడియాలో భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె తన ప్రత్యేకమైన, అద్భుతమైన చిత్రాలు , వీడియోలతో తన అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరోసారి ఫ్యాన్స్ ను అలరించింది.

మలైకా అరోరా ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. మలైకా అరోరా తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం ఏస్ డిజైనర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన తెల్లటి గౌనును ధరించి కుర్రాళ్ళ మనసు దోచేసింది. మలైకా డ్రెస్ సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను గెలుచుకుంటుంది.

మలైకా అరోరా ఫ్యాషన్ గేమ్స్ ఫ్యాషన్ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటాయి. ఫ్యాన్సీ లేదా క్యాజువల్ వేర్ అయినా కెమెరా ముందు కనిపించిన ప్రతిసారీ ఆమె అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. తాజాగా తెల్లటి డ్రమాటిక్ గౌనులో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ అవుట్ ఫిట్ కు వచ్చిన డ్రామాటిక్ రఫుల్ ఐవరీ అలంకారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

మలైకా అరోరాకు సెలబ్రిటీ స్టైలిస్ట్ మేనకా హరిసింఘాని స్టైలిష్ లుక్స్ తో తీర్చిదిద్దింది. చింతన్ షా , నైషా సింఘ్వి అందమైన లుక్స్ ను అందించారు. నటి న్యూడ్ మేకప్‌తో తన రూపాన్ని పూర్తి చేసి ఆమె జుట్టును స్టైలిష్ గా అల్లుకుంది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండానే ఈ బ్యూటీ తన హాట్ లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తోంది.
