Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మలైకా అరోరా ఎప్పుడూ హాట్ లుక్‌లను అందిస్తూ ఇంటర్నెట్ లో హీట్ ను పెంచుతుంటుంది. ఈ 40 ఏళ్ల బ్యూటీ ఇప్పటికి కుర్ర హీరోయిన్ లు కుళ్ళుకునేలా చేస్తోంది. అప్డేటెడ్ స్టైల్స్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఫ్యాషన్ రంగంలో తనదైన బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది. స్టైలిష్ ఐకాన్ గా పేరు సంపాదించుకుంది.

ఈ స్టార్ వార్డ్రోబ్ ఈవెనింగ్ గౌన్లతో నిండి ఉంది అంటే ఏమాత్రం సందేహం లేదు. మలైకా హాజరయ్యే ప్రతి ఈవెంట్ లోనూ, ప్రతి సందర్భంలోనూ ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది ఈ గౌనులే అని చెప్పక తప్పదు. ఇటీవల, మలైకా లేటెస్ట్ ఫోటోషూట్ నుండి తన చిత్రాలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ తన అభిమానులను మరోసారి ఆమెతో ప్రేమలో పడేలా చేసింది.

నీలిరంగు తొడ-ఎత్తైన స్లిట్ తో వచ్చిన గౌనును ధరించి హాట్చూ ఫోటో షూట్ చేసింది మలైకా. ఈ అదిరిపోయే డ్రెస్ ను మలైకా క్లబ్ ఎల్ లండన్ క్లాతింగ్ ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి ఎన్నుకుంది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మేనకా హరిసింఘని మలైకా రూపాన్ని మరింత అందంగా తీర్చిదిద్దింది.

మలైకా ఆకర్షణీయమైన అవతార్‌ను ఫ్యాన్స్ అమితంగా ఇష్టపడ్డారు. మలైకా ఫ్రెండ్స్ ఫరా ఖాన్, రెజీనా కసాండ్రా విద్యా మాలవాడే క్రేజీ కామెంట్స్ పోస్ట్ చేసారు. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ మలైకాను ప్రశంశిస్తు ఫైర్ , హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసారు.

మలైకా అరోరా ధరించిన మిడ్నైట్ బ్లూ వెల్వెట్ గౌన్‌లో అదిరిపోయింది. రౌండ్ నెక్లైన్, ఫుల్-లెంగ్త్ స్లీవ్స్ , ముందు భాగంలో వచ్చిన భారీ స్లిట్, మ్యాక్సీ-పొడవు హెమ్‌లైన్, ఫిగర్ హగ్గింగ్ ఫిట్టింగ్స్ తో డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో మలైకా అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కురాళ్లను ఫిదా చేస్తున్నాయి.

మలైకా క్రిస్టియన్ లౌబౌటిన్ నుంచి సేకరించిన స్ట్రాపీ హై హీల్స్ ను పాదాలకు వేసుకుంది. మేడలో స్టేట్మెంట్ జ్యువెలరీ ధరించి అద్భుతమైన గౌనుకు మరింత ఆకర్షణను తీసుకు వచ్చింది. వెండి లాకెట్ తో అలంకరించబడిన ముత్యాల హారము అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
