Malavika Manmohan : ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ట్రెండ్ మాములుగా నడవడం లేదు. చోట మోట హీరోయిన్ లు కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ అయిపోతున్నారు. వారి స్టైల్స్ డ్రెస్సింగ్ సెన్స్ తో ఫాలోవర్స్ తో పాటు వారి క్రేజ్ ను పెంచేసుకుంటున్నారు .కేరళకు చెందిన యువ హీరోయిన్ మాళవిక మోహనన్ తమిళ చిత్ర పరిశ్రమలో ఈ మధ్యనే ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇంకా తెలుగులోకి ప్రవేశించనప్పటికీ, ఇప్పటికే మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో కనిపించింది.లేడీ సూపర్ స్టార్ ను కామెంట్ చేసి మరింత ఫేమస్ అయ్యింది ఈ చిన్నది.
మాళవిక మోహనన్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. తన చర్మాన్ని ప్రదర్శించే మూమెంట్స్ కోసం ఈ బ్యూటీ వెయిట్ చేస్తూనే ఉంటుంది .తాజాగా నల్లటి దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది మాళవిక . ఆకట్టుకునే ఎక్స్ ఆకారకంతో విభిన్న ఫోటోలను దిగి అందరిని మంత్రముగ్దులను చేస్తోంది. ఆమె తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ గుండెల్లో ఉష్ణోగ్రతలను పెంచుతోంది. ఆమె చూపులు మన్మథుని బాణాలులాగా గుచ్చుకుంటున్నాయి.
మాళవిక అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆమె అందమైన బ్లాక్ అవుట్ ఫిట్ , ఆమె అందాలు ఫ్యాషన్ ప్రియుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ లేస్ అప్ స్కర్ట్ కు జోడీగా కట్ అవుట్, డీప్ నెక్ లైన్ కలిగిన స్లీవ్ లెస్ టాప్ ను వేసుకుని అదరగొట్టింది.
ఈ ఆల్ బ్లాక్ అవుట్ ఫిట్ కు జోడీగా లాంగ్ బూట్స్ ను వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది. మాళవిక దుస్తులు ఆకర్షించినట్లే ఆమె హెయిర్ స్టైల్ కూడా అందరిని ఆకట్టుకుంటోంది. పోకర్ స్ట్రెయిట్ బ్యాంగ్స్తో ఉన్న ఆమె పొడవాటి ముదురు నలుపు రంగు లేయర్డ్ హెయిర్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
కనులకు వింగేడ్ ఐలైనర్, న్యూడ్ మ్యాట్‌తో కూడిన మినిమల్ మేకప్ వేసుకుని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ప్రస్తుతం మాళవిక హిందీ చిత్రం యుధ్రా , తమిళ చిత్రం తంగళన్తో బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్ మారుతి సినిమాలో ప్రత్యేకమైన రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది.
Advertisement