స్మార్ట్ ఫోన్ కి ప్రస్తుతం మానవ సమాజం బాగా ఎడిక్ట్ అయిపొయింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫోన్ లో ముఖం పెట్టేసి గంటల తరబడి గడిపేస్తున్నారు. కొంత మంది ఈ స్మార్ట్ ఫోన్ లో గేమ్స్ కి అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్తున్నారు. కొంత మంది ఇంట్లో తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొని ఇవ్వలేదని ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలాగే పెద్దవారు సెల్ ఫోన్ ద్యాసలో పడి పిల్లల్ని కూడా పట్టించుకోవడం మానేస్తున్నారు. రోడ్డుపై నడుస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడయినా చేతిలో సెల్ ఫోన్ ఉంటే దాంట్లో చాటింగ్ చేసుకుంటూ, వీడియోలు కూసుకుంటూ ఉంటారు. ఈ కారణంగా కొన్ని సమయాలలో ప్రమాదాల బారిన కూడా పడుతూ ఉంటారు. ముఖ్యంగా రోడ్డుపై నడుచుకొని వెళ్లే సమయాలలో ఫోన్ చూసుకుంటూ వెళ్లడం వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.
Lucky man ? pic.twitter.com/iLbKES3iEu
— cctv ediots 📷 (@cctv_videos) August 13, 2022
మ్యాన్ హొల్స్ లో పడిపోవడం, లేదంటే ఏ కారో, బస్సు లాంటివి గుద్దుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఘటన తాజాగా జరిగింది. ఓ వ్యక్తి సెల్ చూసుకుంటూ నేరుగా షాపింగ్ మాల్ నడుచుకుంటూ వచ్చేసాడు. అయితే అక్కడ పై నుంచి ఏవో వస్తువులు క్రిందికి దించుతున్నారు. క్రింద వాటిని ఓ వ్యక్తి అక్కడ ఉండి క్రింది ఫ్లోర్ లోకి విసురుతున్నాడు. సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చిన వ్యక్తి నేరుగా ఆ గ్యాప్ లోంచి క్రింద పడ్డాడు. అదృష్టవశాత్తు క్రింద బాక్స్ లు ఉండటంతో వాటి మీద పడ్డాడు. దీంతో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వీడియోలో ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఏకంగా 2.2 మిలియన్స్ మంది ఈ వీడియోని చూడటం విశేషం.