మనుషులకి ఎలా అయితే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయో అలాగే జంతువులకి, ఇతర ప్రాణులకి కూడా ఉంటాయి. అలాగే వాటికి కూడా ఆకలి, దప్పిక మనలాగే ఉంటాయి. గుక్కెడు నీటి కోసం ఒక్కోసారి మనం కూడా ఎంత ఇబ్బంది పడతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేసవి కాలంలో అయితే దాహంతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. దాహం తీర్చుకునే నీటి కోసం అడవి ప్రాంతాలలో గిరిజనులు మైళ్ళ కొలది నడిచి వెల్తూ ఉంటారు. నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికి వాటికి వృధా చేయరు. అలాగే జంతువులు కూడా దాహంతో అల్లాడి పోయి ఒక్కోసారి మురుగునీటితో దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాయి. తాజాగా ట్విట్టర్ లో ఓ ఉడుత వీడియో వైరల్ గా మారింది. అది ఏ దేశంలో జరిగిందో తెలియదు కానీ ఆ వీడియో చూసిన వారికి మాత్రం హృదయం తరుక్కుపోతుంది.
Heartwarming video of man helping thirsty squirrel drink water from bottle goes viral#ViralVideos @BanjosaCottages pic.twitter.com/yR6oGZfk6e
— Banjosa Developers.! (@BanjosaCottages) August 14, 2022
ఓ వ్యక్తి బోటిల్ నీళ్లు పట్టుకొని ఉన్నాడు. ఓ ఉడుత అతని వద్దకి చేరుకొని దాహంతో అతనిని నీళ్ల కోసం ప్రాధేయపడుతుంది. కొద్ది సేపటి తర్వాత ఆ వ్యక్తి ఉడుత ఆవేదన చూసి బోటిల్ తో నీళ్లు తగ్గించే ప్రయత్నం చేశాడు. ఉడుత కూడా నీళ్లు నోటికి అందించగానే ఆగకుండా బోటిల్ నీటిని తాగేసింది. దాహం తీరిన తర్వాత ఉడుత ఆ రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ వీడియో ఓక జూలో చిత్రీకరించినట్లు ఉంది. ఉడుత దాహం తీర్చిన ఆ వ్యక్తిపై ట్విట్టర్ లో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఉడుత ఎంత దాహంతో ఉంటే కానీ అలా భయపడకుండా మనుషుల మధ్యకి వచ్చి నీళ్ల కోసం ప్రాధేయపడుతుందో కదా అని చర్చించుకుంటున్నారు. ట్విట్టర్ లో ఈ వీడియో వైరల్ కావడంతో ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. దీనిని చూసిన తర్వాత అయినా జీవుల దాహం తీర్చడం ఎంత అవసరమో అందరూ గుర్తించాలని కొంత మంది అభ్యర్థిస్తున్నారు.