Manushi chhillar : ప్రస్తుతం న్యూడ్ కలర్స్ ఫ్యాషన్ రంగాన్ని శాసిస్తున్నాయి. బాలీవుడ్ భామలు, సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో న్యూడ్ కలర్స్ ను అమితంగా ఇష్టపడుతున్నారు. మెటాలిక్‌లు సీక్విన్స్‌లు ట్రెండ్ ను పక్కకు నెట్టి సింపుల్ గా అందంగా ఒంటి రంగులో కలిసిపోయే అవుట్ ఫైట్స్ ను అమితంగా ఇష్టపడుతున్నారు.
పెళ్లిళ్లు అయినా పండుగలైనా విటికిని ధరించేందుకు మక్కువ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు, వివిధ సందర్భాలలో, ఈ శైలిని అత్యంత అందమైన రీతిలో ప్రదర్శిస్తూ ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేరింది.

రీసెంట్ గా చేసిన ఫోటోషూట్ కోసం, మనిషి చిల్లర్ ఫ్యాషన్ డిజైనర్ షెహ్లా ఖాన్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. ఈ ప్రపంచ అందగత్తె బంగారు వర్ణం లో ఆధునిక యుగపు పెళ్లి చీరను ధరించి అందరూ మూర్ఛపోయేలా చేసింది. ఈ చీర రంగు తన మేని రంగు ఒకేలా ఉన్నా ఎంతో హాట్ గా కనిపించింది మానుషి.

బంగారు బగల్ పూసలు , క్రిస్టల్ అలంకారాలతో వచ్చిన ఈ ప్రీ-డ్రేప్ చీర మానుషి ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. చీర అంచుల్లో ఉన్నా పట్టీలపై విల్లు వివరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రీ-డ్రేప్ చీర కు సెట్స అయ్యే విధంగా డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ కలిగిన షార్ట్ స్లీవ్స్ బ్లౌజ్‌తో జత చేసింది. ఈ చీరలో తన నాభి సోయగాలతో పాటు ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

మానుషి తన తన ఎత్నిక్ లుక్ ను మరింత ఆకర్షణీయంగా మార్చుకునేందుకు మెడలో బంగారు వర్ణంలో ఉన్న చోకర్ నెక్లెస్ పెట్టుకుంది. ఈ చీర లుక్ కు తగ్గట్లుగా కనులను పింక్ కలర్ ఐ ష్యాడో కనురెప్పలకు వింగేడ్ ఐ లైనర్, పెదాలకు నిగనిగలాడే లిప్ కలర్ ని దిద్దుకుంది. సముద్రపు అలలు తెలియాడేలా ఆమె తన కురులను లూస్ గా వదులుకుంది.
