Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశారు. అందులో రెండు రీమేక్ మూవీస్ కాగా, మరో రెండు స్ట్రైట్ సినిమాలు కావడం విశేషం. ఖైది 150 వివి వినాయక్ దర్శకత్వంలో చేశారు. ఈ మూవీ విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తమిళ్ మూవీకి రీమేక్ అనే సంగతి తెలిసిందే. తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో వచ్చారు. ఇది బయోపిక్ గా తెరకెక్కింది. దీని తర్వాత గాడ్ ఫాదర్ మూవీ చేశారు. ఈ సినిమా అది మలయాళం హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కింది. కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఆచార్య స్ట్రైట్ సినిమా అయిన డిజాస్టర్ అయ్యింది.
వాల్తేర్ వీరయ్య స్ట్రైట్ స్టొరీతో వచ్చి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరల మెహర్ రమేష్ తో చేస్తున్న భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో చిరంజీవి ఇతర భాషల సినిమాలనే నమ్ముకొని రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. వాటి కోసం దర్శకులని కూడా ఫిక్స్ చేశారు. ముఖ్యంగా సీనియర్ దర్శకులు అయిన వీవీ వినాయక్ – కృష్ణవంశీ పేర్లు వచ్చాయి. 2019లో అజిత్ హీరోగా చేసిన విశ్వాసం సినిమా వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నారు. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.
మళ్ళీ అదే కథతో సినిమా అంటే ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. అలాగే మలయాళంలో వచ్చిన మమ్ముట్టి మూవీ భీష్మ పర్వం అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కులను కూడా చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ రీమేక్ ను వినాయక్ తో చేయాలని అనుకుంటున్నట్లు టాక్. ఈ రెండు రీమేకులలో ముందుగా ఏది సెట్స్ పైకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక గతంలోనే చిరంజీవికి కృష్ణవంశీ వందేమాతరం అనే కథను వినిపించి ఉన్నాడు. అయితే చిరంజీవికి అప్పుడున్న కమిట్మెంట్స్ వలన ఆ కథను చేయడం కుదరలేదు. తాజాగా మరోసారి కథను విన్న చిరంజీవి కొన్ని మార్పులు చెప్పినట్టుగా తెలుస్తోంది.