Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో వచ్చి హిట్ కొట్టాడు ఈ ఏడాది ఆరంభంలో వాల్తేర్ వీరయ్య సినిమాతో సూపర్ హిట్స్ కొట్టాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. వీటిలో వాల్తేర్ వీరయ్య ఈ ఏడాదిలో సినిమాతో ఇండస్ట్రీకి శుభారంభం అందించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడానికి చాలా మంది యంగ్ దర్శకులు సిద్ధం అవుతున్నారు.

వెంకి కుడుముల ఇప్పటికే మెగాస్టార్ కి కథ చెప్పి ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఓ యుట్యూబ్ లైవ్ లో చిరంజీవి పూరి జగన్నాథ్ కి ఆఫర్ ఇచ్చారు. మంచి కథ ఉంటే రెడీ చేసుకోవాలని చెప్పారు. కచ్చితంగా కథని సిద్ధం చేస్తే చేద్దామని మాట ఇచ్చారు. లైగర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నేరుగా ఆఫర్ ఇవ్వడంతో పూరి జగన్నాథ్ ప్రస్తుతం కథని సిద్ధం చేసి కొద్ది రోజుల క్రితం వినిపించినట్లు తెలుస్తుంది. ఇక కథ నచ్చడంతో చిరంజీవి కూడా ఒకే చెప్పారని టాక్ వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మరో వైపు పూరి జగన్నాథ్ మరో వైపు బాలకృష్ణతో కూడా సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. తరువాత పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణలో పూరి జగన్నాథ్ ఎవరితో ముందుగా చేస్తాడు అనేది ఇపుడు ఆసక్తికరంగా మారింది