సమాజంలో ఎక్కడో ఓ చోట ఏదో ఒక రకమైన వెరైటీ కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు వాటి గురించి ప్రపంచానికి తెలిసేది తక్కువ. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి వింతలు జరిగిన వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అలాంటి వీడియోలు కాస్తా ప్రత్యేకంగా ఉండటంతో నెటిజన్లు కూడా విస్తృతంగా షేర్ చేస్తూ వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో ఆ వీడియోలు కాస్తా వైరల్ గా మారుతున్నాయి. తరుచుగా ట్విట్టర్ లో ఇలాంటి వైరల్ వీడియోలు వైరల్ అవుతూ మిలియన్ వ్యూస్ తో నెటిజన్లుని అలరిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ వ్యక్తి పశువుల మాదిరిగా గంజి నీళ్ళు నోటితో తాగుతూ, అక్కడే ఉన్న తవుడుని కూడా తింటున్నాడు. అలాగే తన చుట్టూ ఉన్న వారు అందిస్తున్న పలహారాలు కూడా నోటితోనే తీసుకుంటున్నాడు. అతని ప్రవర్తన వీడియోలో చాలా వింతగా అనిపిస్తుంది.
#ViralVideo
यूपी के महराजगंज जिले में नागपंचमी पर अजीबोगरीब मामला, ग्रामीण के सिर पर हुआ भैंसासुर सवार, खाने लगा घास-फूस, बड़ी संख्या में दर्शन को पहुंचे लोग, लिया सभी ने आशीर्वाद#UttarPradesh pic.twitter.com/7UUSxOUwja— mahansharma (@Mahansharma6) August 3, 2022
దీంతో ఈ వీడియోని అందరూ బఫెల్లో మెన్ అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఉన్న ఆ వ్యక్తికి సంబందించిన కథ కూడా బయటకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో మహారాజ్ గంజ్ ప్రాంతంలో ఈ రకమైన వింత ఆచారం నడుస్తుంది. ప్రతి మూడవ సంవత్సరం నాగ పంచమి రోజున ఆ వ్యక్తి శరీరంలోకి గేదె ఆత్మ ప్రవేశిస్తుంది అని, తరువాత అతను పశువులు తినే ఆహారాన్ని తింటారని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు.బైంసాసురుడు ఆత్మగా దానిని వారు విశ్వసించి ఆ రోజు అతని ఆకలిని భక్తులు తీర్చే ప్రయత్నం చేస్తారు. అలా తీర్చడం వలన మంచి జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. ఆ రోజు గేదె ఆత్మ ఉన్న మనిషికి కేవలం పశువుల ఆహారాన్ని మాత్రమే ప్రజలు తినిపించే ప్రయత్నం చేస్తారు. భారతీయ సనాతన నాగరికతలో ప్రాంతాల బట్టి ఆచార, సంప్రదాయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటిగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది.