గన్నవరం నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీకి బలంకి బలం ఎక్కువ. మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికలలో కూడా టీడీపీ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. వల్లభనేని వంశీ ఇప్పటి వరకు గన్నవరం నుంచి మూడు సార్లు గెలిచారు. ఆయన మొదటి నుంచి టీడీపీతోనే ప్రయాణం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఆయన వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయబోతున్నారు. అయితే వల్లభనేని మీద వైసీపీ తరుపున పోటీ చేసిన యార్లగడ్డ, మరో కీలక నేతగా ఉన్న దుట్టా రామచంద్రరావు మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నారు.
అయితే వంశీకి వైసీపీకి సీటు కేటాయించడంతో ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ఏకం కాబోతున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో వీరు టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది. నిజానికి యార్లగడ్డ, దుట్టా మధ్య అస్సలు పడదు. కాని వల్లభనేని మీద ఉన్న ద్వేషం వీరిద్దరిని దగ్గర చేసింది. దీంతో వీరు ఇద్దరు రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తుంది. రానున్న ఎన్నికలలో టీడీపీ నుంచి తామిద్దరిలో ఒకరికి సీటు ఇవ్వడానికి హామీ వస్తే వెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు బోగట్టా.
అలాగే వంశీ మీద గెలవాలంటే టీడీపీలోకి వెళ్ళడంతోనే సాధ్యం అవుతుందని భావిస్తున్నారు. దీనికి కారణం గన్నవరంలో చౌదరి ఓటుబ్యాంకు బలంగా ఉంటుంది. వీరందరూ టీడీపీకి బలంగా నిలబడతారు వంశీ తన సొంతం బలం ఉందనుకొని వైసీపీలోకి వెళ్ళారు. అయితే మొన్నటి వరకు ఆయన వెంట నడిచిన చౌదరీలు అందరూ కూడా ఇప్పుడు యార్లగడ్డకి మద్దతుగా నిలబడటానికి రెడీ అయ్యారు. టీడీపీ కూడా అతనికి గన్నవరం సీటు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు బోగట్టా.