MLC Elections: ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఏకంగా 107 నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల కోసం ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలలో టీడీపీ, వైసీపీ పార్టీలు రెండు కూడా బలంగా తమ అభ్యర్ధులని గెలిపించుకోవడం వ్యూహాలు వేసాయి. ఇక రెండు పార్టీలు కూడా డబ్బుల పంపిణీ, అలాగే దొంగ ఓట్ల ప్రభావం, ప్రలోభాల పర్వం యధావిదిగా రెండు పార్టీల నుంచి నడిచినట్లు తెలుస్తుంది. అయితే అధికార పార్టీ మాత్రం తాము చేపడుతున్న ప్రజా సంక్షేమం, అభివృద్ధి అజెండాని నమ్ముకున్నాయి. ఈ ఎన్నికలని రాబోయే 2024 ఎన్నికలకి రెఫరెండంగా భావిస్తున్నారు. వీటిలో గెలవడం ద్వారా తమ బలం ఉందని వైసీపీ చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక దొంగ ఓట్ల నమోదు చేసి వారితో కూడా ఓట్లు వేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఇక దొంగ ఓట్లు అంటూ టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనలు కూడా చేశారు. అయితే ప్రతిపక్షాల ఓడిపోబోతున్నాయి కాబట్టి అధికార పార్టీపై ఇలాంటి విమర్శలు చేస్తున్నాయి అని అధికార పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నాయి. ఇక తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలలో వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారని అంటున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానాలలో గెలవడం ద్వారా తమపైన ప్రజల విశ్వాసం ఉందని చూపించుకోవాలని వైసీపీ భావిస్తూ ఉంటే. వైసీపీ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధుల గెలుపు ద్వారా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారు అనేది ఈ నెల 16వ తేదీన ఫలితాలలో తెలబోతుంది. అయితే వీటిపై ఎవరి లెక్కలు వారికి, ఎవరి అంచనాలు వారికీ ఉండటం విశేషం.