Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌తో రోజూ ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూనే ఉంటుంది. బికినీ వేసుకుని బీచ్ లుక్ లో చంపాలన్నా లేదా సౌకర్యవంతమైన కఫ్తాన్‌లలో మెరిసిపోవాలన్నా ఈ బ్యూటీ కి వెన్నతో పెట్టిన విద్య. మౌనికి ఫ్యాషన్ లుక్స్ తో తన అభిమానులను ఎలా ఉక్కిరిబిక్కిరి చేయాలో బాగా తెలుసు. తాజాగా ఈ చిన్నది చీర కట్టుతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తన వయ్యారాలు ఒలకబోస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది.

మౌని చాలా అరుదుగా చీరలను కట్టుకుంటుంది. అందుకే ఆమె చీరలో కనిపించిన ప్రతిసారి అందరి చూపు ఆలా ఆమె వైపు తిరిగిపోతుంది. మౌని చీర డైరీలను ఆమె అభిమానులు అమితంగా ఇష్టపడతారు ఫ్యాషన్ ఆమె చీర కట్టును ఆరాధిస్తారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆక్టివ్ గా ఉండే మౌని ఈ చీర తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మౌని ఈ లుక్స్ చూసి ఫ్యాషన్ ప్రేమికులు స్టైల్ నోట్స్ తీసుకోవడానికి ఉత్సాహపరుస్తున్నారు.

పాస్టెల్ బ్రౌన్ కాటన్ చీరలో చాలా అందంగా కనిపించింది మౌని. ఈ చీరకు మ్యాచింగ్ గా ఆమె పొడవాటి చేతులతో వచ్చిన నలుపు రంగు బ్లౌజ్ ను వేసుకుంది. ఈ చీర కట్టులో ఆమె తన ఒంపులను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ఈ సారీ లుక్ కు సెట్ అయ్యేలా ఆమె మెడలో గోల్డెన్ నెక్ చోకర్ ను అలంకరించుకుంది. ఈ కలర్ ఫుల్ నెక్ పీస్ మౌని అందాలను రెట్టింపు చేసాయి.

మౌని తన వెంట్రుకలతో అందమైన జడను వేసుకుని , గులాబీ పూలను అలంకరించుకుని , జడ చివరగా గోల్డెన్ జారీ వివరాలతో వచ్చిన కుచ్చులను జోడించింది. మేకప్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ చెట్టియార్ సహాయంతో, మౌని ఎత్నిక్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది.

మౌని తన కనులకు వింగేడ్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా, కనుబొమ్మలను డార్క్ చేసుకుని పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని ముఖాన ఎర్రటి పెట్టుకుని సాంప్రదాయ లుక్ లో అదరగొట్టింది.