Mrunal Thakur : వెండితెర ప్రిన్సెస్ నూర్జహాన్ తన లుక్స్‌తో యూత్‌కు కిక్కిస్తోంది. ఈ మధ్యకాలంలో అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌తో ఈ భామ చేస్తున్న ఫోటో షూట్ పిక్స్ కుర్రాళ్ళను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నాయి. సంప్రదాయ వస్త్రాల నుంచి మోడ్రన్ దుస్తుల వరకు అన్నింటిలోనూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తనదైన ఫ్యాషనబుల్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ చిన్నది. అంతే కాదు ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. తెలుగులో చేసింది ఒకే సినిమా అయినా ఈ అమ్మడికి మామూలు పాపులారిటీ రాలేదు. సీతారామమ్ లో తన క్యూట్ ఆక్టింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తూ ఖుషీ చేస్తుంటుంది. ట్రెడిషనల్, వెస్ట్రన్ అవుట్ ఫిట్స్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. తాజాగా లేటెస్ట్ అప్‌డేటెడ్ అవుట్‌ఫిట్ ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ.
మృణాల్ ఠాకూర్ ఉత్కంఠభరితమైన , ఆకట్టుకునే 3D పూల వన్ షోల్డర్ గౌను ధరించి హాట్ ఫోటో షూట్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఇటీవలే ఒక అవార్డ్ షోలో ఈ 3D పూల డిజైన్స్‌తో వచ్చిన అద్భుతమైన గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్‌ను అలంకరించి అందిరి చూపును తనవైపుకు తిప్పుకుంది. రఫిల్ డీటైల్స్, వన్ షోల్డర్ పట్టీ, 3D పూల అలంకరణలతో వచ్చిన ఈ లేత గులాబీ రంగు గౌనులో ఎంతో హాట్‌గా కనిపించింది మృణాల్. డీప్ నెక్‌లైన్‌తో వచ్చిన ఈ గౌన్ లో మృణాల్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా గ్లామరస్ పిక్స్‌ను దించాడు ఫోటోగ్రాఫర్స్. ఈ యాంగిల్‌లో అమ్మడి అందాలు చూస్తూ ఫ్యాన్స్ మంత్రముగ్ధులవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ధరించిన ఈ మాస్టర్ పీస్ అంతర్జాతీయ డిజైనర్ సైద్ కొబీసీ యొక్క సృష్టి.
ఈ పింక్ కలర్ 3D ఫ్లోరల్ గౌన్‌కు మ్యిచ్ అయ్యే విధంగా వింగెడ్ డిజైన్స్ లో వచ్చిన జ్యువెల్లరీని ఎంచుకుంది మృణాల్. చేతి వేళ్లగా రెక్కల ఆకారంలో ఉన్న ఉంగరం ధరించి, చెవులకు అదే ఆకారంలో వచ్చిన ఇయర్‌రింగ్స్‌ను అలంకరించుకుంది. మృణాల్ ఠాకూర్ జుడిత్ లీబర్ కలెక్షన్స్ నుండి పింక్ క్లచ్ , క్రిస్టియన్ లౌబౌటిన్ నుండి హీల్స్‌ను ఎన్నుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.
ఈ పిక్స్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలకు అభిమానులు లైకులు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె అభిమాని ఒకరు “యువరాణి నూర్జహాన్ #సీత” అని కామెంట్ పోస్ట్ చేయగా మరొకరు “అందాల రాణి” అని కమెంట్ చేశాడు.
ఆమె హెయిర్‌ను సొగసైన నీట్ మిడ్-హై బన్‌లో కట్టి, మృణాల్ ఠాకూర్ సాఫ్ట్ గ్లామ్ మేకప్ లుక్‌ని ఎంచుకుంది. కను రెప్పలపై లైట్ పింక్ ఐ ష్యాడో, కనులకు ఐలైనర్ పెదాలకు న్యూడ్ పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది మృణాల్.