Mrunal Thakur : చేసింది ఒక్క సినిమానే అయినా తన ఫ్యాషన్ స్టైల్స్ తో ప్రేక్షకులను సోషల్ మీడియా ద్వారా అలరిస్తూనే ఉంటోంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆమె మనోహరమైన రూపం అత్యుత్తమమైన నటనా నైపుణ్యాలతో మృణాల్ ఠాకూర్ కు పెద్ద సంఖ్యలో అభిమానలు ఉన్నారు.

ఈ బ్యూటీ లేటెస్ట్ ట్రెండ్స్ కు తగ్గట్లుగా దుస్తులను ఎంపిక చేసుకుని ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తూ అభిమానుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. ఇటీవలి ఓ ఫోటో షూట్ కోసం మృణాల్ ఠాకూర్ అందమైన క్లాసీ నలుపు రంగు అవుట్ ఫిట్ ను ధరించి తనలోని స్టైలిష్ యాంగల్ ను మరోసారి ఫ్యాన్స్ కు పరిచయం చేసింది.

డ్రెస్ చూడటానికి సింపుల్ గా ఉన్నా మృణాల్ మాత్రం కత్తిలా కనిపిస్తోంది. వైట్ స్కిన్ బ్లాక్ డ్రెస్ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యింది. మృణాల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో వరుస పెట్టి ఈ బ్లాక్ ఫ్రాక్ పిక్స్ ను పోస్ట్ చేసి తన అనుచరులకు ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు ఈ పిక్స్ కింద “అలెక్సా ప్లే ఇంతందం 2.0” అని క్యాప్షన్ ను జోడించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పిక్స్ షికారు చేస్తున్నాయి.

మిడి హేమ్ పొడవు, లోతైన వీ నెక్లైన్, ఫిగర్-స్కిమ్మింగ్ ఫిట్ తో డిజైన్ చేసిన నలుపు రంగు స్లీవ్‌లెస్ డ్రెస్‌లో ఆమె చాలా అందంగా కనిపించింది..ఈ అవుట్ ఫిట్ ను డిజైనర్ లేబుల్ కేట్ స్పేడ్ షెల్ఫ్‌ల నుండి ఎన్నుకుంది. ఇక స్టైలిస్ట్ షీఫా గిలానీ మృణాల్ కు అందమైన లుక్స్ ను అందించింది.

ఈ అవుట్ ఫిట్ల్ కు తగ్గట్లుగా బటన్ స్టడ్స్ ను అవుట్‌హౌస్ జ్యువెలరీ షెల్ఫ్‌లను ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ కాశిష్ సిన్హా సహాయంతో, మృణాల్ కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుని , కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని మంత్రముగ్ధులను చేస్తోంది.