Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ అత్యద్భుతమైన ఫ్యాషన్‌వాది. నటి తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. స్లిప్ డ్రెస్‌లో సెగలు పుట్టించే ఈ బ్యూటీకి ఫార్మల్ ప్యాంట్‌సూట్‌లలో ఎలా స్టైల్ చేయాలో బాగా తెలుసు. బాస్ లేడీ లుక్ తో అదరగొట్టాలన్నా ఆరు గజాల చీరను చుట్టు అరిపించాలన్నా ఈ బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పాలి. పండుగ సీజన్ లో స్పెషల్ లుక్ లో మెరవాలనుకునే వారు ఈ బ్యూటీ ఫ్యాషన్ టిప్స్ ను ఫాలో అయితే సరిపోతుంది. మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎత్నిక్ వేర్ తో చేసిన హాట్ ఫోటో షూట్‌లు ఫ్యాషన్ లరవ్స్ ను ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా మృణాల్ పండుగ వేళ ఎత్నిక్ లుక్ లో కనిపించి తన ఇన్‌స్టాగ్రామ్ అభిమానులను ఇంప్రెస్ చేసింది. అందమైన లెహెంగా సెట్ వేసుకుని తన ఫ్యాన్స్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది ఈ భామ. ఈ లెహెంగా సెట్‌లో గ్లామరస్ లుక్స్ లో కనిపించి కుర్రాళ్ళను ఫిదా చేసింది.

మృణాల్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ వివనికి మ్యూజ్ గా వ్యవహరించింది. తన తాజా ఫోటో షఊట్ కోసం ఈ చిన్నది అద్భుతమైన ఎల్లో కలర్ లెహంగాను ఎంచుకుంది. సిల్వర్ సీక్విన్స్, ఎంబ్రాయిడరీ వివరాలతో ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన పసుపు రంగు డిజైనర్ బ్లౌజ్‌లో మృణాల్ అద్భుతంగా కనిపించింది. ఆమె టల్లే నమూనాలతో వచ్చిన పసుపు రంగు శాటిన్ స్కర్ట్‌ను ఈ బ్లౌజ్ కు జత చేసింది. వెండి జరీ వర్క్ బార్డర్స్ కలిగి ఉన్న పసుపు రంగు శాటిన్ దుపట్టాను జోడించింది. ఈ లెహెంగాకు జత చేసింది.

ఈ ట్రెడిషనల్ వేర్ కు తగ్గట్లుగానే ఆబరణాలను ఎంచుకుంది మృణాల్. మెడను వెండి నెక్ చోకర్ తో అలంకరించింది. చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. మృణాల్ తన మేకోవర్ ను సింపుల్ గా ఉంచుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, కనురెప్పలకు మస్కరా, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ పెట్టుకుని ఎంతో కూల్ గా గ్లామర్ డాల్ లా కనిపించింది. అభిమానులను అలరించింది.