Mumbai : సినీ తారలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీల్డ్ ఫెస్టివల్ ముంబైలో అట్టహాసంగా జరిగింది. తారల రాకతో ఈ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. బెస్ట్ పర్ఫామెన్స్ ను అందించిన తారలు పురస్కారాన్ని అందుకున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది , ఈ చిత్రానికి గాను అనుపమ్ ఖేర్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. గంగూబాయి కతియావాడి సినిమాలో తన నటనకు గాను అలియా భట్ ఉత్తమ నటి గా అవార్డును అందుకోవడమే కాకుండా బ్రహ్మాస్త్ర చిత్రానికి భర్త రణబీర్ కపూర్ తరపున ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకుంది.

కన్నడ చిత్రం కాంతారాలో అద్భుతమైన నటనకు గాను నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. వరుణ్ ధావన్ కూడా భేదియా చిత్రానికి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుచుకున్నాడు. క్రిటిక్స్ ఉత్తమ నటిగా విద్యాబాలన్ పురస్కారాన్ని అందుకుంది.

బాలీవడ్ ప్రముఖ సీనియర్ నటి రేఖ ఆమె సినిమా పరిశ్రమలో అత్యుత్తమ సహకారం అందించినందుకు గాను ఆమెను అవార్డుతో సత్కరించారు. ఇక వీరితో పాటు ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా ఆర్ఆర్ఆర్ అవార్డును అందుకుంది.

ఉత్తమ దర్శకుడి క్యాటగిరిలో చుప్ , ది రివేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా ఆర్. బాల్కి అవార్డును అందుకున్నారు. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా సాచిన్ తాండన్. ఉత్తమ సహాయ నటుడిగా మనీష్ పాల్ లు అవార్డులను అందుకున్నారు.

టెలివిజన్ విభాగంలో, రూపాలీ గంగూలీ నటించిన అనుపమ టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ ఫెస్టివల్లో గెలుచుకుంది. ఉత్తమ తెలివిషన్ నటుడిగా జైన్ ఇమానన్ , ఉత్తమ నటిగా తేజస్వి ప్రకాష్, ఉత్తమ సహాయ నటిగా షీబా చద్దా ఎంపికయ్యారు. ఇక వెబ్ సిరీస్ విభాగంలో రుద్ర, ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ఉత్తమ వెబ్ సిరీస్ గా ఎన్నికైంది.