Mumbai : చాలా రోజుల క్రితం ఓటీటీలో విడుదలైన సూపర్ డీలక్స్ సినిమాను అలాగే ఫాలో అయ్యి సూపర్ గా ప్లాన్ వేశాడో ప్రభుద్దుడు. సినిమాలో లాగా తాను చేసిన తప్పును ఈజీగా తుడిచేసుకుందామనుకున్నాడు. కానీ ఆ పప్పులేమీ ఉడకవని ముంబై పోలీసులు నిరూపించారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళను చంపి ఆమె మృతదేహాన్ని బెడ్ బాక్స్ లో చుట్టి దాచేసి చేతులు దులుపుకుందామనుకున్నాడు. కానీ పోలీసుల నిఘా నేత్రాలకు చిక్కాడు. మహారాష్ట్ర లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరిని ఆలోచింపజేస్తోంది.

మహారాష్ట్రకు లోని పాల్ఘర్ జిల్లా కు చెందిన హార్దిక్ షా 37 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఏమైందో ఏమో ఆమెతో గొడవ పడి చడీచప్పుడు కాకుండా ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత ఏం చేయాలో అర్థంకాని ఈ ప్రభుద్దుడు ముంబై సమీపంలోని వారి నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో మంచం ఉంచే ప్రదేశంలో పరుపులో ఆమె మృతదేహాన్ని దాచిపెట్టాడు. అనంతరం హార్దిక్ పారిపోయేందుకు ప్రయత్నించగా రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.

హార్దిక్ నిరుద్యోగి. ఏ పని చేసేవాడు కాదు. ఇతనితో సహజీవనం చేస్తున్న 37 మేఘ నర్సు. ఇంటి ఖర్చులు అన్నీ మేఘనే భరించేది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలే ఆమె హత్యకు దారితీశాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మేఘాను హత్య చేసిన తర్వాత హార్దిక్ ఇంట్లోని కొన్ని వస్తువులను విక్రయించి డబ్బుతో పరారయ్యాడని పోలీసులు తెలిపారు. అతను రైలులో పారిపోతున్నాడనే సమాచారంతో, పోలీసులు అతని స్థానాన్ని ట్రాక్ చేసి, రైల్వే పోలీసులు మధ్యప్రదేశ్లోని నాగ్డాలో అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు క్రైం బ్రాంచ్ బృందం వెళుతోందని ముంబై పోలీసులు తెలిపారు.

మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న హార్దిక్, మేఘా గత ఆరు నెలలుగా సహజీవనం చేస్తున్నారు. దాదాపు నెల రోజుల క్రితం అద్దె ఇంటికి మారారు.వారి పొరుగువారు కూడా తరచుగా హార్దిక్, మేఘాల గొడవలపై ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.వివాహేతర సంబంధాలు అనర్థాలకు దారి తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేస్తాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.