Bigboss 6 : బిగ్‌బాస్ రియాలిటీ షో త్వరలోనే బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఆరో సీజన్‌లోకి త్వరలోనే అడుగు పెట్టనుంది. దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక దాదాపు పూర్తైనట్టు తెలుస్తోంది. అలాగే లోగో, ప్రోమో వచ్చేశాయి. ప్రోమోకు అదిరిపోయే ఆదరణ లభించింది. పెళ్లి అప్పగింతల తంతు నేపథ్యంలో డిజైన్ చేసిన ఈ ప్రోమో బాగా ఆకట్టుకుంది. ఇక బిగ్‌బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు సీజన్-6లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటితో పాటే దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. యాంకర్ ఉదయభాన్, గీతూ రాయల్, ఆదిరెడ్డి, దీపికా పిల్లి, ఆర్జే సూర్య, నందు, ఆశాశైనీ, నేహా చౌదరి, గీతూ రాయల్, శ్రీహాన్, అమర్‌దీప్, చలాకీ చంటి, భరత్.. తదితరులు షోలో అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక గత మూడు సీజన్స్(3,4,5)తో పాటు బిగ్‌బాస్ ఓటీటీకి కూడా హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున.. ఆరో సీజన్‌కి కూడా హోస్టింగ్ చేయబోతున్నారు. ఇక ఎప్పటి మాదిరిగానే బిగ్‌బాస్ సీజన్-6కి నాగార్జున తీసుకునే రెమ్యుననరేషన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హోస్ట్ రెమ్యూనరేషన్ అంటే మామూలుగా ఉండదు. ఓ రేంజ్‌లోనే ఉంటుంది. అలాంటిది నాగ్ ఎంత తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Bigboss 6 : గత సీజన్ కోసం నాగ్ రూ.12 కోట్లు తీసుకున్నారట..
గత సీజన్ కోసం నాగ్ ఒక్క ఎపిసోడ్‌కు రూ. 12 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. షో మొత్తానికి కలిపి రూ.12కోట్లు తీసుకున్నారని సమచారం. ఇక ఇప్పుడు సీజన్-6 కోసం ఏకంగా రూ. 14 నుంచి 15 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే యాంకర్ ఉదయ భాను అందరి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఆమె ఎంత తీసుకోబోతోందనేది మాత్రం బయటకు రాలేదు. ఇక కంటెస్టెంట్స్ నుంచి ఇప్పటి వరకూ వైరల్ అవుతున్న అన్ని విషయాలకు సంబంధించి క్లారిటీ కావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.