Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య తన వ్యక్తిగత జీవితం విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాడు. మీడియా ముందుకొచ్చి ఇష్టానురీతిన మాట్లాడటం వంటివి ఏమీ చేయడు. చాలా డీసెంట్‌గా వ్యవహరిస్తాడు. ఈ యంగ్ హీరోపై సమంతతో విడాకుల ముందు వరకూ ఒక్కటంటే ఒక్క రూమర్ కూడా లేదు. కానీ ప్రస్తుతం రోజుకో రూమర్. విడాకుల విషయాన్ని వెల్లడించి ఊరుకున్నాడంతే. సమంత గురించి ఎలాంటి వ్యతిరేక కామెంట్స్ కూడా చేయలేదు. అసలు మీడియా ముందుకు రావడమే చాలా అరుదు. ఇక సోషల్ మీడియాలోనైతే దాదాపు కనిపించడు. ఒకవేళ కనిపించినా వృత్తిపరమైన విషయాలను మాత్రమే పంచుకుంటాడు. అలాంటి చై వ్యక్తిగత జీవితంపై ఇటీవల రూమర్లు బాగా వస్తున్నాయి.
Naga Chaitanya : వారానికొక పుకారు..
హీరోయిన్ సమంతతో విడాకులు అనంతరం నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అంతేకాదు బాలీవుడ్ హీరోయిన్‌తో చైతన్య డేటింగ్ చేస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న చై తనపై వస్తున్న రూమర్లు, హీరోయిన్‌తో ప్రేమాయణం వంటి వార్తలపై స్పందించాడు. బాలీవుడ్ మీడియాతో చై మాట్లాడుతూ.. ‘ఈ మధ్య నాపై రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. వారానికొక పుకారు షికారు చేస్తూనే ఉంది. వాటిని చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి అసలు సంబంధమే లేని పుకార్లు సృష్టిస్తున్నారు. అసలు అవి ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ప్రారంభంలో వాటిని చూసి నవ్వుకునే వాడిని. కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశా’ అని పరోక్షంగా డేటింగ్ వార్తలను కొట్టిపడేశాడు.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్లో ఉన్నారంటూ ఓ వార్త ఫిలింనగర్లో గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వార్తలను సమంతే ప్రచారం చేయిస్తోందంటూ ఆమెపై కొందరు చై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారనుకోండి. కాగా.. ఇటీవల ఈ పుకార్పై స్పందించిన శోభితా ఆ వార్తలను కొట్టిపారేసియగా.. తాజాగా చై సైతం ఖండిచాడు. చై అభిమానులు సైతం ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై ఆగ్రహం చేస్తున్నారు. దీంతో ఇకనైనా ఇలాంటి వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.