మెగా బ్రదర్ నాగబాబు ఏ విషయంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడుతారనే విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీని ఎవరైనా టార్గెట్ చేస్తే ముందు రియాక్ట్ అయ్యేది నాగబాబు గారే. తనదైన శైలిలో కౌంటర్లు వేయడం మాటకు మాట సమాధానం చెప్పడం నాగబాబు స్పెషాలిటీ. కాగా ఏపీలో సినిమా రిలీజ్ పరిస్థితి ఎలా ఉందన్నది చెప్పాల్సిన పనిలేదు. తగ్గిన టిక్కెట్ ధరలతో సినిమాలు ప్రదర్శించడం ఇండస్ర్టీకి మింగుడు పడని అంశమైంది. జగన్ సర్కార్ కొత్త జీవో ఇంకా రిలీజ్ చేయలేదు. జగన్ సర్కార్ రేపో మాపో అన్న తీరుగా వ్యవహరిస్తోంది తప్ప, ఎప్పుడు ఉత్తర్వులు ఇస్తారో? లేదో కూడా తెలియదు . దానిపై కూడా క్లారిటీ లేదు.
ఈ అంశంపై పరిశ్రమ అంతా సానుకూలంగానే ఉంది అనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్
రిలీజ్ కి ముందే జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెబుతుందని అంతాభావించిన అది జరగ లేదు. కానీ సీన్ రివర్స్ అయ్యి కూర్చుంది. అయితే అప్పట్లో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇండస్ట్రీ మద్దతివ్వలేదు. అవి కేవలం ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగానే భావించాలని ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొంత మంది పెద్దలు స్పందించారు కూడా . ఈ నేపథ్యంలో తాజా పరిస్థితుల్న బేరీజు వేసుకుని నాగబాబు ఇండస్ట్రీ -సినిమా రెలిజిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు.
తెలుగు సినీ పరిశ్రమ అంతా జగన్ కి అండగా నిలవాలి అని కోరుకుంటున్నా. అవసరమైతే జగన్ సీఎంగా ఉన్నంత కాలం టాలీవుడ్ లో ఏ సినిమా విడుదల చెయ్యకుండా ఉండాలి. సినిమా ఇండస్ట్రీ ని ఎలాగైనా అణిచివేయాలని చూస్తున్నారు. కాబట్టి మీ సినిమాల రిలీజ్ కోసం ఓటీటీకి వెళ్లిపోండి. అమెజాన్ ప్రైమ్..నెట్ ప్లిక్స్ ని ఉపయోగించుకోండి. ఏపీలో మాత్రం సినిమాల్ని ప్రదర్శించడానికి జియో టెలికాస్ట్ టెక్నాలజీ ఉపయోగించండి. తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లలో సినిమాలను రిలీజ్ చేయండి. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని“ అన్నారు.
ఇంకా…ఓటీటీ రిలీజ్ సినిమాలు చేయడం చాలా ఈజీ అవుతుంది. హీరోలని 150 వర్కింగ్ డేస్ అడిగే బదులు 60 రోజులు అడగండి. దాని ద్వారా సినిమా త్వరగా పూర్తవుతుంది. నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. స్టార్ హీరోలు ఒక సినిమాకి బదులుగా 3 ఓటీటీ సినిమాలు చేయోచ్చు. ఆ రూపంలోనూ హీరోలు బాగానే సంపాదించుకోవచ్చు “అని అన్నారు.
మరి నాగబాబు ఇచ్చిన సలహాలు ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతాయా అంటే ? ఓటీటీ ఛాయిస్ అనేది అంత సులభమేమి కాదు. ఏపీలో జియో టెక్నాలజీతో టెలికాస్ట్ చేసి,తెలంగాణ లో థియేటర్లో ఒకేసారి రిలీజ్ చేయడం అన్నది సాధ్యమయ్యేది పని కాదు.
అలాగే జరిగితే సినిమా పైరసీ జరుగుతుంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల పంపిణీ దారుల్ని ఒప్పించడం కష్టమైన పని అవుతుంది. అప్పుడు పంపిణీదారుడు రిస్క్ చేసి సినిమాని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఏపీలో థియేట్రికల్ ఆదాయం పూర్తిగా కోల్పోయినట్లే అవుతుంది. నాగబాబు సూచనలు పాటిస్తే మొత్తం థియేటర్ రిటర్న్ మోడల్..రెవెన్యూ వ్యవస్థనే తలక్రిందులు అయిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.