Nagababu : మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు. అంతేకాదు.. మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది ఇండస్ట్రీలో.. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది ఈ రోజు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారంటే అది మెగాస్టార్ చలవే. చిరు రాజకీయాల్లో రాణించలేకపోయినప్పటికీ ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు. జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు కూడా జనసేన పార్టీ బాధ్యతలను చూసుకుంటూ జనసేనలో కీలకంగా మారారు.
అయితే ప్రస్తుతం పవన్, నాగబాబులు జనసేనను బలోపేతం చేయాలని చూస్తుంటే చిరంజీవి మాత్రం ఏపీ సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా జగన్‌పై చిరు ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్‌కు మాత్రం చిరు ఏమాత్రం సహకారం అందించడం లేదనే టాక్ బహిరంగంగానే వినిపిస్తోంది. దీంతో జనసేకులు సోషల్ మీడియాలో చిరంజీవిపై ఫైర్ అవుతున్నారు. చిరు వల్లే పవన్ పొటికల్‌గా ఎదగలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్, నాగబాబులు సైతం చిరుపై గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Nagababu : మంచివాళ్లను దూరం చేసుకుంటే.. ముంచేవాళ్లే దొరుకుతారు
తాజాగా నాగబాబు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో మంచి వాడు శత్రువులకు సైతం సాయం చేస్తాడని.. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను సైతం ముంచుతాడని పేర్కొన్నారు. ‘‘మంచివాడు శత్రువులకు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు. మంచివాళ్లను దూరం చేసుకుంటే.. చివరకు ముంచేవాళ్లే దొరుకుతారు’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చిరంజీవి గురించే నాగబాబు పెట్టారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇది చిరు గురించి కాదు.. జగన్ గురించి అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ పెద్ద చర్చకే దారి తీసింది. ఇక ఈ పోస్ట్ కు నెటిజన్లు నాగబాబు చిరును ఉద్దేశించే ఈ కామెంట్స్ చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.