టాలీవుడ్ కింగ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున వారసులుగా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అక్కినేని నాగ చైతన్య, అఖిల్ అక్కినేనిల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడో ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ.. కెరీర్ పరంగా వీరిద్దరూ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారని చెప్పాలి. ఇక వాళ్ళ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి 2017లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు నాగచైతన్య
కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే తాము విడిపోతున్నామని చైతు-సామ్లు ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అఖిల్ 2016లో ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్లతో నిశ్చితార్థం చేసుకున్నా సంగతి తెలిసిందే. అయితే ఈ జంట పెళ్లి పీటలెక్కకుండానే పేటకులైంది. ఆ తర్వాత అఖిల్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడు.
ఇద్దరు కొడుకులు ఒంటరి జీవితాన్నే గడుపుతుండటం వల్ల నాగార్జున ఎంతగానో బాధ పడుతున్నారని తెలుస్తోంది. పైగా ఎక్కడికి వెళ్లినా కూడా కుమారుల పెళ్లి గురించే అడగడంతో నాగ్ మరింతగా మదన పడిపోతున్నారట. అందుకే కొడుకులకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారని సమాచారం. అయితే సామ్ -చైతులు ఇంకా అఫీషియల్ గా విడాకులు రాలేదు.
అందువల్ల అఖిల్ కి పెళ్లి చేసేయాలని డిసైడ్ అయ్యారట నాగ్. ఈ నేపథ్యంలోనే చిన్న కోడలు పిల్ల కోసం నాగార్జున వేట మొదలుపెట్టారని సమాచారం. అంతేకాదు ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని అమ్మాయినే అక్కినేని ఇంటికి కోడలుగా తీసుకురావాలని అనుకుంటున్నారు . ఇక అఖిల్ కి సరిపడే అమ్మాయి దొరికితే.. త్వరలోనే చిన్న కొడుకు పెళ్లి ప్రకటన ఉంటుందని అంటున్నారు.