Nandamuri Taraka Ratna : నందమూరి వారసుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. గతకొన్ని నెలలుగా కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, తాజాగా సీనియర్ నటి జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి లాంటి వారు మృతిచెందిన విషయం అందరికీ తెలిసిందే. ఒక్క కృష్ణ కుటుంబంలోనే ముగ్గురు కన్ను మూశారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకి సంబంధించి ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని అభిమానులు కంగారు పడుతున్నారు.
ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు. నందమూరి వంశం నుంచి హీరోగా తెలుగు తెరకి పరిచయమైన తారకరత్న మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. హీరోగా అవకాశాలు తగ్గినా కూడా ప్రత్యేక పాత్రల్లో నటించి అలరిస్తున్నాడు. అయితే, తెదేపా యువ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో ఆయనతో కలసి తారకరత్న కూడా నడిచారు.
Nandamuri Taraka Ratna : తారకరత్న ఆరోగ్యంపై రకరకాల వార్తలు..
అనుకోకుండా ఈ శుక్రవారం మధ్యాహ్నం తారకరత్న తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ పరిస్థితి అదుపుతప్పుతుందనే ముందు జాగ్రత్తతో ఆయనను బెంగళూరుకి తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు తీవ్రంగా గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. అంతేకాకుండా, ఆయన గుండెలోని ఎడమ వైపు కవాటం 90 శాతం బ్లాక్ అయినట్లు తెలిపారు. అయినా కూడా బీపీ మాత్రం బాగానే ఉందని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రాణాపాయం తప్పినట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.