Nani- Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం దసరా. ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యనే విడుదలైన సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ నెట్టింట్లో సెన్సేషన్ అయ్యింది. సాంగ్ లో అప్పటికే నానై లుక్ ను రెవీల్ చేసారు డైరక్టర్ ఓదెల శ్రీకాంత్. ఫుల్ మాస్ లెన్త్ లో ఈ సారి నాని అలరించనున్నాడు. కథానాయకిగా నటిస్తున్న కీర్తి ఫుల్ మాస్ లుక్ లో కనిపించనుంది. మార్చ్ 30 న పాన్ ఇండియా సినిమాగా దసరాను విడుదల చేయనున్నారు . ఈ నేపథ్యంలో మూవీ టీం తాజాగా దసరా టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ లో హీరోయిన్ పాత్ర ఎక్కడ రెవీల్ చేయకపోవడం తో ఇప్పుడు ఇదే అంశం పై ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. కీర్తి టీజర్ లో కనిపించకపోవడం తో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
తన మోస్ట్ అవైటెడ్ మూవీ దసరా టీజర్‌ను నాని సోమవారం సోషల్ మీడియా లో విడుదల చేశాడు. టీజర్ లాంచ్‌కు ముందు,“ శ్రీకాంత్ ఓదెల ఈ పేరు గుర్తుపెట్టుకోండి” అని నాని ట్వీట్ చేశాడు. దసరా రాగానే అందరూ దర్శకుడి పేరు గురించే చర్చించుకుంటారని ఈ కాప్షన్ తో నాని చెప్పేసాడు. ఇదిలా ఉంటే నాన్ని టీజర్ చూసిన ఫ్యాన్స్ నాని యాక్టింగ్ సూపర్టూ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని మెసేజ్ లు చేస్తున్నారు అభిమానులు.
విజువల్స్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం విపరీతమైన హింసాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. వీర్లపల్లి అనే మురికి గ్రామంలో జరిగే కథ ఇది. గ్రామం చుట్టూ బొగ్గు గనులు ఉన్నాయి, ఈ మూవీ లో నాని వియోలెంట్ గా నడుముకు మద్యం బాటిల్ పెట్టుకుని మందు తాగుతూ కనిపిస్తాడు . “మేము మద్యానికి బానిస కాదు,” “మద్యపానం మన సంప్రదాయంలో అంతర్భాగం అని అనే నాని డైలాగ్ ను బట్టి నాని ఈ మూవీ లో తాగుబోతు అని తెలుస్తోంది.
నాని హీరోగా తన తోటి వారి కోసం బహుశా ఉన్నత సామాజిక వర్గాలలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడడం ఇందులో కనిపిస్తోంది. ఈ సీన్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పుష్ప రాజ్‌ను గుర్తు చేస్తుంది. అయితే నాని మూవీ టీజర్ లో హీరోయిన్ కనిపించలేదు. దీనితో కీర్తి సురేష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే కొంత మంది మాత్రం కీర్తి క్యారెక్టర్ ను డైరెక్టర్ సస్పెన్స్ లో ఉంచారని అనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, కోలివుడ్ లో కీర్తి కి మంచి క్రేజ్ ఉంది. దాదాపు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. ప్రిన్స్ మహేష్ తో చేసిన సర్కారు వారి పాట లో కీర్తికి డైరెక్టర్ మంచి ప్రియార్టీ ఇచ్చారు. కానీ దసరా టీజర్ లో ఒక్క ఫ్రేమ్ లో కూడా తమ అభిమాన నటి కనిపించకపోవడంతో కాస్తంత నిరుత్సాహ పడుతున్నారు.