Nara Lokesh: తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్రని ఏపీ రాజకీయాల్లో కలిగి ఉంది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు చేతిలోకి తీసుకున్న తర్వాత ఏపీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది తప్ప సొంత బలంతో ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పొత్తు ద్వారానే అధికారంలోకి వచ్చింది. మరల 2024 ఎన్నికల్లో జనసేనతో పోతు పెట్టుకుని అధికారంలోకి రావాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ రూపంలో కొంత నెగిటివ్ ఉందని చెప్పాలి.
పుత్రోత్సాహం కారణంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ నారా లోకేష్ కి అప్పగించారు. అయితే నారా లోకేష్ మాత్రం తనకు ఎవరైతే సన్నిహితంగా ఉంటున్నారు అలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలు చేసిన వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే తనకి వ్యతిరేకంగా ఉన్న వారిపై దుష్ప్రచారం చేయిస్తూ వారిని పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వల్లభనేని వంశీ కూడా ఇదే విషయాన్ని తాను బయటకు వచ్చిన సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ రాయలసీమలో ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేసారు.
నిజానికి గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తున్న సెకండ్ క్యాడర్ నాయకుల అభిప్రాయాలను కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా, అధిష్టానంతో చర్చించకుండా నారా లోకేష్ అభ్యర్థులను ఖరారు చేయడం ఇప్పుడు తెలుగుదేశం వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఒకరిద్దరి వరకు ఓకే గాని ఇలా పాదయాత్ర చేసిన ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులను నారా లోకేష్ నేరుగా ప్రకటించుకుంటూ వెళ్లిపోతే అక్కడ మిగిలిన వారి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారింది. నారా లోకేష్ ఇలా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తెలుగుదేశం పార్టీలో తన నిర్ణయం ఫైనల్ అనే అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులకు తీసుకెళ్తున్నారు.
ఇప్పటికే లోకేష్ అతి జోక్యంపై తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్లు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటూ వెళ్తే కచ్చితంగా అది పార్టీకి నష్టం తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనిని ఎంత మాత్రం కూడా సీనియర్ నాయకులు అంగీకరించే అవకాశం ఉండకపోవచ్చు అనమాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గత యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని మాట తెలుగుదేశం పార్టీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా నారా లోకేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం వర్గాలలో కొంత ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది టాక్ నడుస్తుంది.