యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర నేటి నుంచి కుప్పం నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక ఈ యువగళం ఆరంభం చాలా గ్రాండ్ గా ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే పాదయాత్రని బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్ళదానికి టీడీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర వైపు చూస్తుంది. ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృస్తిస్తున్నా కూడా నిబంధనలకి లోబడి నారా లోకేష్ ఈ పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ యువగళం ప్రారంభం కాబోతుంది. ఇక మొదటి రోజు పెద్ద ఎత్తున రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్ర ఆరంబోత్సవానికి హాజరై నారా లోకేష్ తో పాదం కదపడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
పాదయాత్రలో భాగంగా బహిరంగ సభ కూడా జరగనున్న నేపధ్యంలో దానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరానున్నారు. ఇక ఈ బహిరంగ సభలో నారా లోకేష్ ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇదిలా ఉంటే యువతని దగ్గర చేసుకోవడంతో పాటు మహిళలకి కూడా భరోసా ఇచ్చేలా ఈ పాదయాత్రలో పొలిటికల్ లక్ష్యాలని నారా లోకేష్ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు వ్యూహాలతోనే నారా లోకేష్ పాదయాత్ర జరగబోతుంది. ఇదిలా ఉంటే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే కుప్పానికి చేరుకున్న నారా లోకేష్ ఘన స్వాగతం లభించింది. కాబోయే ముఖ్యమంత్రి అంటూ అతన్ని కార్యకర్తలు కీర్తించారు.
ఇక లోకేష్ కూడా ఈ యాత్ర ద్వారా తనని తాను బలమైన నాయకుడుగా ప్రాజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనలో ఉన్న నెగిటివ్స్ ని అధికమించి బలమైన నాయకత్వ లక్షణాలు పెంచుకొని భవిష్యత్తు టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా టీడీపీ కార్యకర్తలలో కూడా నమ్మకం కలిగించడానికి తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నేపధ్యంలో మొదటిరోజు లోకేష్ పాదయాత్రకి స్పందన ఎలా వస్తుంది. వైసీపీ నాయకులు ఈ పాదయాత్రని అడ్డుకోవడానికి ఏమైనా కుట్రలు చేసే అవకాశం ఉందా అనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.